మామా అల్లుళ్ళు మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నార..? వెంకి మామతో నాగచైతన్య నటించడానికి సై అంటున్నాడా..? మరి వీరిద్దరు కలిసి ఏ సినిమాలో సందడి చేయబోతున్నారు..?
మామా అల్లుళ్ళు మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నార..? వెంకి మామతో నాగచైతన్య నటించడానికి సై అంటున్నాడా..? మరి వీరిద్దరు కలిసి ఏ సినిమాలో సందడి చేయబోతున్నారు..?
యంగ్ హీరోలకు కూడా పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం వెంకటేశ్ 'సైంధవ్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 13న తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా కావడంతో.. ఈసినిమా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఒక వైపు ఈసినిమా చేస్తూనే.. మరికొన్ని ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకటేష్.. అందులో సుధాకర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో నిర్మించనున్నారని అంటున్నారు. అయితే ఈసినిమా మల్టీ స్టారర్ సినిమా అనేది తాజా సమాచారం. అందువలన ఈ సినిమాలో మరో హీరో పాత్రకి నాగచైతన్యను తీసుకున్నట్టు తెలుస్తోంది. '
గతంలో ఈ ఇద్దరు మామా అల్లుడు వెంకీమామ సినిమా చేశారు. ఈమూవీతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమాఇది. ఈమూవీ అఫీషియల్ గా కన్ ఫార్మ్ అయితే.. ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. అది కంప్లీట్ అయిన తరువాత ఆయన వెంకీ ప్రాజెక్టులో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కాని తెలియదు.