`ఫియర్‌`తో భయపెడతానంటోన్న వేదిక.. గ్రాండ్‌గా తెలుగులో కొత్త సినిమా లాంఛ్‌..

Published : Jan 17, 2024, 11:31 PM ISTUpdated : Jan 17, 2024, 11:49 PM IST
`ఫియర్‌`తో భయపెడతానంటోన్న వేదిక.. గ్రాండ్‌గా తెలుగులో కొత్త సినిమా లాంఛ్‌..

సారాంశం

వేదిక అడపాదడపా తెలుగు సినిమాలు చేసి మెప్పించింది.ఇప్పుడు వరుసగా తెలుగులో బిజీ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మరో సినిమాని ప్రారంభించుకుంది. 

హీరోయిన్‌ వేదిక తెలుగులో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. 2007లో కళ్యాణ్‌ రామ్‌ `విజయదశమి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యిందీ బ్యూటీ. `బాణం`, `దగ్గరగా దూరంగా`అనే చిత్రాలు చేసింది. మళ్ళీ గ్యాప్‌ తీసుకుని, బాలయ్యతో `రూలర్‌` చేసింది. ఆ మధ్య `బంగార్రాజు`లో గెస్ట్ రోల్‌ చేసింది. ఇప్పుడు మళ్లీ తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. 

ప్రస్తుతం ఆమె `రజాకార్‌`, `జంగిల్‌` అనే చిత్రాలు చేస్తుంది. దీంతోపాటు కొత్తగా మరో తెలుగు సినిమా ప్రారంభించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న `ఫియర్‌` మూవీలో నటిస్తుంది. అరవింద్‌ కృష్ణ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారు. హరిత గోగినేని దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  `ఫియర` మూవీ బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది.  

సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నటులు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా, డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ వేదిక మాట్లాడుతూ, `ఫియర్` మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది. నేను తెలుగులో `కాంచన`, `రూలర్` సినిమాల్లో నటించాను. ఓ వెబ్ సిరీస్ చేశాను, కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో నటించలేదు. 

డైరెక్టర్ హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టోరీ, క్యారెక్టర్స్ డిజైన్ లో హరిత చాలా క్లారిటీగా ఉన్నారు. కొత్త డైరెక్టర్ అని నాకు అనిపించలేదు. దత్తాత్రేయ మీడియా సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది. అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ తో ఫియర్ మూవీ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు.

డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ - డైరెక్షన్ చేయడం అనేది నా డ్రీమ్ కాదు డెస్టినీ అనుకుంటాను. ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అనేది ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది` అని చెప్పారు.

నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ - హరిత నా వైఫ్. మా సంస్థలో లక్కీ లక్ష్మణ్ సినిమాకు వర్క్ చేసింది. ఆ మూవీకి చాలా క్రాప్ట్స్ సూపర్ విజన్ చేసేది. ప్రతి పనిలో డెడికేటెడ్ గా ఉంటుంది. ఆమె డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం ఉంది. `ఫియర్` స్క్రిప్ట్ ను చాలా బాగా రాసుకుంది. ఆ స్క్రిప్ట్ ను యాక్సెప్ట్ చేసి హరితకు సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి థ్యాంక్స్. ఆమె ఛాలెంజింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతోంద`న్నారు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్