Varun Tej: ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వరుణ్ తేజ్..!

Published : Jul 02, 2022, 03:21 PM IST
Varun Tej: ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వరుణ్ తేజ్..!

సారాంశం

మెగా హీరో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వరుణ్ తేజ్ రోల్ పై అప్డేట్ అందుతుంది. లేటెస్ట్ న్యూస్ సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది.   


2022 వరుణ్ తేజ్(Varun Tej) మిక్స్డ్ రిజల్ట్ అందుకున్నారు. ఆయన సోలో గా నటించిన గని చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గని మూవీలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేశారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఫలితం మాత్రం దెబ్బేసింది. గని రిజల్ట్ బెడిసికొట్టినా... ఎఫ్3 మూవీ హిట్ ట్రాక్ ఇచ్చాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 హిట్ టాక్ సొంతం చేసుకుంది. వెంకీ-వరుణ్ తేజ్ నటించిన ఈ సీక్వెల్ ఆదరణ దక్కించుకుంది. అయితే వసూళ్ళపరంగా పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోయింది. పెద్ద చిత్రాల మధ్య నలిగి పోయిన ఎఫ్3 తెలుగు రాష్ట్రాల్లో దెబ్బేసింది. ఓవరాల్ గా పర్లేదు అనిపించింది. 

కాగా వరుణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు(Praveen Sattaru)తో ప్రకటించారు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీలో వరుణ్ పాత్రపై విశ్వసనీయ సమాచారం అందుతుంది. వరుణ్ ని ప్రవీణ్ సత్తారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపించనున్నారట. ఆయన ఇండియన్ యూనియన్ మినిస్టర్ భద్రత అధికారిగా బాధ్యతలు నెరవేరుస్తాడట. ఇక మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలను  బౌర్నే సీరీస్ కి పనిచేసిన అలిస్టర్ క్లార్క్, టాడర్ లజరోవ్ రూపొందించనున్నారు. 

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జున హీరోగా ది ఘోస్ట్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. . 2017లో విడుదలైన గరుడవేగ మూవీతో ప్రవీణ్ సత్తారు ఫేమ్ తెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత హీరో రాజశేఖర్ కి బ్రేక్ ఇచ్చిన మూవీ గరుడవేగ. ఆ మూవీలో రాజశేఖర్ ఎన్ఐఏ అధికారిగా చేశారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ తనకు మంచి విజయం ఇస్తాడనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు వరుణ్. 

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?