‘ఆర్సీ15’ కోసం రామ్ చరణ్ న్యూ లుక్ .. చెర్రీని కొత్తగా చూపించనున్న శంకర్

By team teluguFirst Published Jul 2, 2022, 3:17 PM IST
Highlights

టాప్ డైరెక్టర్ శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్సీ15’. ఈ చిత్రం కోసం చెర్రీ ఎంతగానో కష్టపడుతున్నారు. బెస్ట్ పెర్ఫామెన్స్ తో పాటు న్యూ లుక్ లోనూ కనిపించనున్నారు. 
 

టాలీవుడ్ టాప్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్సీ15’ (RC15). ఈ చిత్రం కోసం చెర్రీ ఎంతగానో కష్టపడుతున్నారు. బెస్ట్ పెర్ఫామెన్స్ తో పాటు కొత్త లుక్ లో కనువిందు చేసేందుకు యత్నిస్తున్నాడు. చెర్రీ సినిమాలోని తన పాత్రకు తగ్గట్టుగా స్టైల్ ను మార్చుకుంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిరుత నుంచి చివరిగా వచ్చిన ఆచార్య  వరకు చరణ్ నటించిన పాత్రలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ‘మగధీర.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్’లో ఆకర్షణీయమైన లుక్ లో కనిపించారు.

ప్రస్తుతం శంకర్ సినిమా కోసం చెర్నీ చాలా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. కొత్త హెయిర్ స్టైయిల్, చిన్న బియర్డ్ తో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ న్యూ లుక్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చెర్రీ లుక్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. రామ్ చరణ్ కొత్త లుక్ ను తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. 

ఇదిలా ఉంటే.. ‘ఆర్సీ15’ మూవీ షూటింగ్ ప్రస్తుతం నార్త్ ఇండియాలో కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా షెడ్యూల్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా చరణ్ లోకేషన్ నుంచి అభిమానులతో దిగిన ఫొటో కూడా వైరల్ అయ్యింది. త్వరలో మూవీ టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. 

ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ గా అదరగొట్టనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర్ క్రియషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.170 కోట్లతో సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంజలి, జయరామ్, సునిల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

click me!