Varun Tej: సెలైన్ పెట్టించుకుని మరీ ప్రమోషన్స్ లో వరుణ్‌ తేజ్‌

Surya Prakash   | Asianet News
Published : Apr 06, 2022, 05:28 PM IST
Varun Tej: సెలైన్ పెట్టించుకుని మరీ ప్రమోషన్స్ లో వరుణ్‌ తేజ్‌

సారాంశం

ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం మెగా వారసుడు చాలా కష్టపడ్డారు. ఫ్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి ఆరు పలకల బాడీని రెడీ చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘గని’ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు పతాకస్థాయిలో  చేస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా “గని” విడుదలకు సిద్దమైన అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇక ‘ఎఫ్ 2’ ‘గద్దలకొండ గణేష్’ వంటి వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న వరుణ్.. ”గని” సినిమాతో హ్యాటిక్ సక్సెస్ అందుకుంటారని ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ లో వరుణ్ తేజ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ కు వరుణ్ తేజ చేతికి సిలైన్ పెట్టే  hand cannulaతో వచ్చి షాక్ ఇచ్చారు.

ఇందుకు కారణం వరుణ్ తేజ...డీ హైడ్రేషన్ తో ఇబ్బంది పడ్డాడని సమాచారం. దాంతో సిలైన్ పెట్టారని  తెలిసింది. ఇంటర్వూలలో చాలా వీక్ గా ఆయన కనిపించారు. వైజాగ్ ఈవెంట్ కు వెళ్లి వచ్చాక వడదెబ్బే కొట్టినట్లు సమాచారం. దాంతో వీక్ అయ్యారని, డాక్టర్ల పర్యవేక్షణలో సిలైన్ పెట్టించుకుని, రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్ కు వచ్చేసారు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం మెగా వారసుడు చాలా కష్టపడ్డారు. ఫ్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి ఆరు పలకల బాడీని రెడీ చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘గని’ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు పతాకస్థాయిలో  చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ కు మీడియా ఇంటరాక్షన్ లో ఓ రకమైన ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది కూడా. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన పబ్ రైడ్ లో నిహారిక పేరు ప్రముఖంగా మీడియాలో రావడంతో మెగా కుటుంబ సభ్యులు అందరూ షాక్ లో ఉన్నారు. ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్ చాలా ఇబ్బంది పడుతున్నాడట. చెల్లెలు నిహారిక అంటే వరుణ్ కి ప్రాణం. అదీ కాకుండా, ఇప్పుడు తన సినిమా ‘గని’ విడుదలకు సిద్ధంగా ఉండడంతో సమస్య వచ్చిందని చెప్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్