మెగాస్టార్ కాళ్ల మీద పడిని ఈ చిన్నారి ఎవరో తెలుసా...? టాలీవుడ్ స్టార్ హీరో ఇతను ఎవరు..?

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ యంగ్ హీరో తన చిన్ననాటి గురుతును రిలీజ్ చేశాడు. చిరంజీవికి సాస్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఇంతకీ ఎవరతను.
 



ఈరోజు (అగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో.. సెలబ్రిటీ స్టార్స్ చాలా మంది ఆయనకు రకరకాలు గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి రకరకాలుగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తున్నారు.  ఈక్రమంలో ఓ యంగ్ హీరో చిరంజీవికి డిఫరెంట్ గా విష్ చెప్పారు.  తన చిన్నప్పుడె మెగాస్టార్ కాళ్ళకు తాను దండం పెడుతున్న ఫోటోను షేర్ చేయడంతో పాటు.. మెగా స్టార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించాడు. 

ఈ ఫోటోలో చిరంజీవి తో పాటు.. ఆయన తండ్రి కూడా ఉన్నాడు. ఆ పిల్లాడు చిరు కాళ్ళకు సాస్టాంగ నమస్కారం చేయాలని చూశాడు. 
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? అతను ఎవరో కాదు..మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే.. అతను ఎవరో కాదు బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఈమెగా హీరో  తన పెదనాన్న కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోని, అట్లాగే తన పెళ్లిలో చిరంజీవిని కౌగిలించుకున్న ఫోటోని షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. చిన్నప్పటి ఫొటోలో చిరంజీవి తండ్రి కూడా ఉన్నారు.

Latest Videos

 

ఈ ఫోటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఓ నోట్ కూడా రాశారు. ఆయన ఏమని రాశారంటే.. మాకు ప్రతి సమస్యని నవ్వుతో ఎదుర్కోవడం నేర్పించినందుకు, ప్రేమ, అనుభంధాలతో మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్ డాడీ.... నువ్వే మాకు అతి పెద్ద ఇన్స్పిరేషన్. నువ్వు మాతో ఉన్నందుకు థ్యాంక్యూ. హ్యాపీ బర్త్ డే డాడీ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు వరుణ్ తేజ్. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. మెగా ప్యాన్స్ ఈ పోస్ట్ తో దిల్ ఖుష్ అవుతున్నారు. 
 

click me!