మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెక్ట్స్ ఫిల్మ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాగాగా ఆసక్తికరమైన ట్రైలర్ ను విడుదల చేసింది టీమ్.. కీలక సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మరియు మానుషీ చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). దేశం కోసం ఫైలట్ గా సాహసాలు చేయబోతున్నారు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీలో బైలింగ్వువల్ గా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్దా, సహ-నిర్మాతలు నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలు అప్డేట్స్ అంది ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఫైనల్ స్ట్రైక్ అంటూ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), హిందీలో సల్మాన్ ఖాన్ (Salmaan Khan) ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల 42 సెకన్ల నిడివి గల ట్రైలర్ వరుణ్ రుద్రను నిలబడమని చెప్పడం, అతను ఆదేశాలను ధిక్కరించడంతో ప్రారంభమవుతుంది.
కొన్నేళ్లుగా వరుణ్ రుద్ర ఎయిర్ ఫోర్స్ లో చేస్తున్న యుద్దాలను చూపించారు. అలాగే అతని గర్ల్ ఫ్రెండ్, సోనాల్ (Manushi) రాడార్ ఆఫీసర్ పాత్రను పవర్ ఫుల్ గా చూపించారు. భారతీయ సైనికులపై చేస్తున్నయుద్ధాలను తిప్పికొట్టేందుకు రుద్ర ఎంతటి సాహసానికైనా ముందుకొస్తారు. ఈ క్రమంలో ఎయిరియల్ స్ట్రైక్, యుద్ధ సన్నివేశాల్లో సత్తా చాటుతాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. తోటి IAF పైలట్‌లుగా నవదీప్, అలీ రెజా, రుహానీ శర్మ ఉన్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది.