వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. యమ స్పీడుమీదున్నాడే!

Published : Dec 20, 2018, 03:44 PM IST
వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. యమ స్పీడుమీదున్నాడే!

సారాంశం

మెగా హీరోలందరూ ఒక దారిలో వెళుతుంటే వరుణ్ తేజ్ మాత్రం సపరేట్ సక్సెస్ రూట్ ని ఎంచుకుంటున్నాడు. చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. 

మెగా హీరోలందరూ ఒక దారిలో వెళుతుంటే వరుణ్ తేజ్ మాత్రం సపరేట్ సక్సెస్ రూట్ ని ఎంచుకుంటున్నాడు. చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా అంతరిక్షం సినిమాతో రాబోతున్నాడు. ఇక ఆ సినిమా అనంతరం F2ని సంక్రాంతి బరిలో దింపనున్నాడు. 

ఆ తరువాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా హరీష్ శంకర్ ప్రాజెక్టును సెట్స్ పైకి తేనున్నాడు ఈ కుర్ర హీరో. దీంతో ఈ మెగా హీరో యమ స్పీడుమీదున్నాడే అనే టాక్ వస్తోంది. తమిళ్ హిట్టు సినిమా జిగర్తాండా ను తెలుగులో రీమేక్ చేయాలనీ కంకణం కట్టుకున్న హరీష్ గత కొన్ని రోజులుగా కథలో ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్నాడు. 

ఫైనల్ గా వరుణ్ తేజ్ సెట్టవ్వడంతో జనవరిలో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న ఈ కామెడీ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖ టాలీవుడ్ నటీనటులను ఫిక్స్ చేసిన హరీష్ త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar 30 Days Collections: జవాన్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన ధురంధర్‌.. బాలీవుడ్‌లో నెం 1.. కలెక్షన్లు ఎంతంటే?
Jana Nayakudu Trailer: `భగవంత్‌ కేసరి`ని మక్కీకి మక్కీ దించేసిన విజయ్‌.. కొత్తగా చూపించింది ఇదే.. వాళ్లకి వార్నింగ్‌