రీసెంట్ గా రవితేజ తాను కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తో డేట్స్ ఇబ్బంది వచ్చిందని, ఈ ప్రాజెక్టుకు డేట్స్ కేటాయించలేమని నిర్ణయించుకున్నామని దర్శక,నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ కథని వరుణ్ తేజ దగ్గరకు తీసుకెళ్లినట్లు వినికిడి. అయితే ఇంకా వరుణ్ తేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
రవితేజ ఆ మధ్యన వరస పెట్టి ప్రాజెక్టులు ఒప్పుకున్నారు. అయితే క్రాక్ సక్సెస్ తర్వాత మళ్లీ ఒక్కసారి తన ప్రాజెక్టులను సరిచూసుకుంటున్నారు. తను చేయగలిగిన,తన బాడీ లాంగ్వేజ్ లకు సరిపడినవే ఓకే చేసుకుని మిగతావి నో చెప్పేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ఓ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ స్క్రిప్టులోకి ఇప్పుడు వరుణ్ తేజ్ వచ్చి చేరినట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏమిటి..ఎవరా దర్శకుడు వంటి వివరాల్లోకి వెళితే...
‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నాను అని ఆ మధ్యన ప్రకటించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కునున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే రీసెంట్ గా రవితేజ తాను కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తో డేట్స్ ఇబ్బంది వచ్చిందని, ఈ ప్రాజెక్టుకు డేట్స్ కేటాయించలేమని నిర్ణయించుకున్నామని దర్శక,నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ కథని వరుణ్ తేజ దగ్గరకు తీసుకెళ్లినట్లు వినికిడి. అయితే ఇంకా వరుణ్ తేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కుమార్ బెజవాడ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తి కమర్షియల్ హంగులతో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇందులో హీరో పాత్ర లాయర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలోనూ ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారట. వీరిలో శ్రీలీలా, లవ్లీ సింగ్ ఉన్నారు. ఇందులో మరో హీరోయిన్ గా ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లాను తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మాస్ మహారాజా రవితేజ... వరుస సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ‘క్రాక్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన రవితేజ, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ‘ఖిలాడి’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మార్చిలోపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనేది రవితేజ ప్లానింగ్. ఈ సినిమా కూడా తుది దశకు చేరుకుంది.