Varun Tej Ghani: సెన్సార్ పూర్తి చేసుకున్న గని... రిలీజ్ డేట్ ఎప్పుడిస్తారో...?

Published : Feb 12, 2022, 07:35 AM IST
Varun Tej Ghani: సెన్సార్ పూర్తి చేసుకున్న గని... రిలీజ్ డేట్ ఎప్పుడిస్తారో...?

సారాంశం

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన స్పోర్డ్స్ డ్రామ గని. ఈమూవీ రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. కరోనా వల్ల రెండు సార్లు వాయిదా పడ్డ ఈమూవీ  రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది.

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన స్పోర్డ్స్ డ్రామ గని. ఈమూవీ రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. కరోనా వల్ల రెండు సార్లు వాయిదా పడ్డ ఈమూవీ  రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్ గ్రైండ్ తో తెరకెక్కిన సినిమా గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సార్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇక ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. క్యారెక్టర్ కు తగ్గట్టు తన బాడీని కంప్లీట్ గా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ తో రోమన్ శిల్పంలా తయారయ్యాడు వరుణ్.

సిక్స్ ఫీట్.. సిక్స్ ప్యాక్ తో వరుణ్ తేజ్ హ్యాండ్సమ్ లుక్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక బాక్సీంగ్ కోసం ప్రత్యేకంగా ఫారెన్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చాడు వరుణ్ తేజ్. అయితే కరోనా వల్ల ఈమూవీ చాలా లేట్ గా సెట్స్ మీదకు వెళ్ళింది. పాండమిక్ టైమ్ ను తప్పించుకుంటూ.. గ్యాప్ లో షూటింగ్ చేసుకుంటూ.. రిలీజ్ వరకూ వచ్చింది.   
అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇక  తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ ఈమూవీకి  U/A సర్టిఫికెట్ ను ఇచ్చింది. యంగ్ తరంగ్  తమన్ సంగీతం అందించిన గని సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు.  జగపతిబాబు, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, కన్నడ సీనియర్ హీరో.. ఉపేంద్ర గనిలో కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. ఇక ఈ సినిమాలో నదియా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. డిసెంబర్ లోనే రిలీజ్ కావల్సిన ఈమూవీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు టీమ్.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం