Mrunal Thakur: 'జెర్సీ' హీరోయిన్ సూసైడ్ గోల, క్లారిటీ ఇదిగో

Surya Prakash   | Asianet News
Published : Feb 12, 2022, 06:50 AM IST
Mrunal Thakur: 'జెర్సీ' హీరోయిన్ సూసైడ్ గోల, క్లారిటీ ఇదిగో

సారాంశం

రోజు ట్రైన్ లో కూర్చోవడానికి ప్లేస్ ఉండేది కాదు. డోర్ దగ్గర నిలబడాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎంతో చిరాకు వచ్చేది. అలా నిలబడడం చాలా కష్టం. ఆ టైమ్ లో అక్కడి నుంచి దూకితే ఎలా ఉంటుంది..? చచ్చిపోతానా..? బతుకుతనా ..? అని ఆలోచించదాన్ని.


బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడంటే చాలా మందికి హాట్ ఫేవెరెట్. అయితే ఆమె తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడింది. ఒంటిరితనం ఆమెలో ఆత్మహత్యా ఆలోచనలను పేర్చింది. ముంబై ప్రారంభ జీవితం ఆమెను చాలా నిస్సహాయరాలుగా మార్చేసింది. ఈ విషయాలన్ని ఇప్పుడు మీడియాతో పంచుకుంది.

సూపర్ 30 సినిమాలో హృతిక్ సరసన నటించి అందరిచేతా శభాష్ అనిపించుకున్న ఈమె  ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ సరసన నటిస్తోంది. రీసెంట్ గా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో  మృణాల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను నెమరువేసుకొంది.
 
“ముంబైలో ఒంటరిగా జీవించాను. అది అంత సులభమైన విషయం కాదు.  కొన్నిసార్లు అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి. నేను చదువుకునే రోజుల్లో ట్రైన్ లో వెళ్లేదాన్ని.. రోజు ట్రైన్ లో కూర్చోవడానికి ప్లేస్ ఉండేది కాదు. డోర్ దగ్గర నిలబడాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎంతో చిరాకు వచ్చేది. అలా నిలబడడం చాలా కష్టం.

ఆ టైమ్ లో అక్కడి నుంచి దూకితే ఎలా ఉంటుంది..? చచ్చిపోతానా..? బతుకుతనా ..? అని ఆలోచించదాన్ని. ఇక స్టూడెంట్ లైఫ్ దాటుకొని నటిగా మారడానికి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో కష్టాల ఫలితంగా నేను ఇక్కడ నిలబడిగలిగాను” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

 ప్రస్తుతం మృణాల్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో ఆమెను ఇంత చిన్న విషయానికి సూసైడ్ ఆలోచనలు చేస్తావా అని తిట్టిపోస్తున్నారు. దాంతో ఆమె వెంటనే తను చెప్పిన విషయాలను క్లారిటీ ఇస్తూ స్టేట్మెంట్ ఇస్తూ ట్విట్టర్  లో రాసుకొచ్చింది.

మృణాల్ మాట్లాడుతూ...నేను రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో మాటలను మీడియా వేరే విధంగా ప్రచారం చేస్తోంది. నేను మాట్లాడింది నా ఛైల్డ్ హుడ్ డేస్ గురించి. వాటిలో ఉన్న సున్నితమైన సమస్యల గురించిచెప్పా..మీడియా సెన్సేషన్ చేసేసింది.అందుకే మీడియాతో నిజాయితీగా మాట్లాడాలంటే భయం వేస్తుంది. నా ఇంటర్వూని పూర్తి గా చూడమని ముక్కలు ముక్కలు గా చూడవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా.. అదే విధంగా మీడియా మిత్రులను కొన్ని విషయాలను హైలెట్ చేసి సెన్సేషన్ చేయద్దని కోరుతున్నా అంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం