
మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రయోగాత్మకం చిత్రం అంతరిక్షం. వరుణ్ వ్యోమగామి పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. చిత్రంలో లావణ్య త్రిపాఠి - అదితి రావ్ హైదరి కథానాయికలు. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఘాజి సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. సినిమాలో ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. సమయమా అంటూ సాగే ఈ పాట నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది.
హరిణి - యజిన్ నిజార్ ఆలపించిన ఈ పాటను ప్రశాంత్ ఆర్ విహారి కంపోజ్ చేశారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఇక క్రిష్ సమర్పణలో రానున్న ఈ స్పెస్ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్టైన్మెంట్ పై రాజీవ్ రెడ్డి రాధా కృష్ణ నిర్మిస్తున్నారు.