సూపర్ స్టార్ స్పీడ్ తగ్గట్లేదుగా!

By Prashanth MFirst Published Nov 30, 2018, 6:15 PM IST
Highlights

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడు లేని విధాంగా సినిమాలను చాలా స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నాడు. ఆరు పదుల వయసులో కుర్ర హీరోల కంటే వేగంగా షూటింగ్స్ లను పూర్తి చేస్తూ మరో సినిమాను సెట్స్ పైకి తెస్తున్నాడు.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడు లేని విధాంగా సినిమాలను చాలా స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నాడు. ఆరు పదుల వయసులో కుర్ర హీరోల కంటే వేగంగా షూటింగ్స్ లను పూర్తి చేస్తూ మరో సినిమాను సెట్స్ పైకి తెస్తున్నాడు. కాలా - 2.0 సినిమాలతో ఈ ఏడాది రచ్చ చేసిన రజినీకాంత్ నెక్స్ట్ పేట్ట సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. 

ఇటీవల ఆ సినిమా షూటింగ్ కు కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాడు. కుదిరితే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ మురగదాస్ తో చేయడానికి డిసైడ్ అయ్యాడు. గత కొంత కాలంగా మురగదాస్ రజినీకాంత్ తో మంచి ప్రాజెక్ట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నాడు కానీ వర్కౌట్ అవ్వడం లేదు. 

రీసెంట్ గా మంచి కథ సెట్ కావడంతో రజినీకాంత్ స్టైల్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఇక పేట్ట సినిమా రిలీజ్ అవ్వగానే జనవరిలోనే మురగదాస్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించి 2019 ఎండింగ్ లోనే సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి రజినీకాంత్ తన స్పీడ్ తో ఎలాంటి విజయాల్ని అందుకుంటాడో చూడాలి.  

click me!