ఎన్టీఆర్ దర్శకుడికి అరుదైన గౌరవం!

By Prashanth MFirst Published Nov 30, 2018, 5:53 PM IST
Highlights

మొదటి సినిమా గమ్యంతోనే తన ప్రతిభ ఎలాంటిదో నిరూపించుకున్నాడు దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి). ఏ సినిమా చేసినా అందులో ఒక మంచి సందేశం ఉండేలా చూసుకోవడం టాలీవుడ్ లో అతనికే సాధ్యమైంది. ఇక గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా క్రిష్ స్థాయిని పెంచింది. 

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ కు అరుదైన గౌరవం లభించింది. ది గ్రేట్ గురజాడ అప్పారావు 103 వర్ధంతి సందర్బంగా క్రిష్ గురజాడ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ "తెలుగు రచన పుట్టిన్ట్లో ఒక శతాబ్దం వెనక్కి వెళ్లాను.. మహాకవిగురజాడ" అంటూ ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ లో ఎన్టీఆర్ కెరీర్ ను చూపించి రెండవ భాగంలో ఆయన రాజకీయ జీవితం గురించి వివరించనున్నారు. 

click me!