మర్డర్ మూవీపై కోర్ట్ లో వర్మ వింత వాదన..!

By Satish ReddyFirst Published Aug 14, 2020, 5:45 PM IST
Highlights

తన ఆర్ జి వి వరల్డ్ థియేటర్ కోసం వరుసగా సినిమాలు ప్రకటించిన వర్మకు మర్డర్ మూవీ విషయంలో మాత్రం కొంచెం ప్రతి ఘటన ఎదురవుతుంది. మర్డర్ మూవీ విడుదల ఆపి వేయాలంటూ అమృత ప్రణయ్ న్యాయపోరాటానికి దిగగా, కోర్ట్ లో వర్మ ఆసక్తికర వాదనవినిపించారు . 
 

వర్మ జోరుకు మర్డర్ మూవీ కొంచెం బ్రేక్ వేసేలా ఉంది. ఈ మూవీ కి వ్యతిరేకంగా అమృత ప్రణయ్ న్యాయపోరాటానికి దిగారు. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ఓ పరువు హత్య సంచలనం రేపింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమృత భర్త ప్రణయ్ ని ఆమె తండ్రి మారుతీ రావు హత్య చేయించారు. ఆ కేసు కోర్టులో ఉండగానే ప్రణయ్ తండ్రి మారుతీ రావు ఆత్మ హత్య చేసుకున్నారు. అమృత ప్రణయ్ ల ప్రేమకథలో ఎంతో విషాదం మరియు నాటకీయత చోటు చేసుకుంది. ఇక వివాదాలే పెట్టుబడిగా సినిమాలు చేసే వర్మ ఈ సంఘటన ఆధారంగా మర్డర్ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వాస్తవ పాత్రలకు దగ్గరగా నటులను ఆయన తీసుకొని తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీ ప్రోమోలు చూసిన అమృత న్యాయస్థానాలను ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా మూవీ తీయడం నేరం అని ఆమె ఆరోపణ. అలాగే కేసు కోర్టులో నడుస్తుండగా సినిమా తీయడం వలన సాక్షులు ప్రభావితం అవుతారని ఆమె నల్గొండ ఎస్పీ, ఎస్టీ కోర్ట్ లో పిటీషన్ వేయడం జరిగింది. ఈ పిటీషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొద్దిరోజుల క్రితం ఈ కేసు విచారణకు రాగా, వర్మ తరుపు న్యాయవాది అనారోగ్యం వలన ఆయన కోర్టుకి హాజరుకాలేదని వివరణ ఇవ్వడం జరిగింది. 

తాజా కోర్ట్ హియరింగ్స్ లో వర్మ తరపు న్యాయవాది కొత్త వివరణ ఇచ్చారట. ఈసినిమాలో ఎవరినీ కించపరచలేదు అన్నారట. మర్డర్ మూవీలో ఎవరినీ తప్పుగా చూపించలేదనేది వర్మ వాదనగా తెలుస్తుంది. ఈ మూవీ విడుదల నిలిపివేయాలని అమృత కోరుతున్న తరుణంలో మరి న్యాయవాదులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. పవన్ ఫ్యాన్స్ ని ఢీ కొట్టి పవర్ స్టార్ మూవీ విడుదల చేసిన వర్మకు మర్డర్ విషయంలో షాక్ తప్పేలా లేదు అంటున్నారు కొందరు. 

click me!