ఉద్యోగి కిడ్నాప్ కేసు: జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరైన పీవీపీ

Siva Kodati |  
Published : Aug 14, 2020, 04:20 PM IST
ఉద్యోగి కిడ్నాప్ కేసు: జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరైన పీవీపీ

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పీవీపీ ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు. 2018లో పీవీపీ ఉద్యోగి తిమ్మారెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించి పీవీపీతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పీవీపీ ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు. 2018లో పీవీపీ ఉద్యోగి తిమ్మారెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు.

ఇందుకు సంబంధించి పీవీపీతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. ఈ కేసులో పీవీపీతో పాటు కుటుంబసభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

కాగా ఈ కేసులో ఈ నెల 18 వరకు ఆయన్ను అరెస్ట్ చేయడం లాంటి చర్యలేవీ చేపట్టవద్దని హైకోర్టు గత గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. తనపై కేసును కొట్టివేయాలని, సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఎ కింద నోటీసును ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పీవీపీ హైకోర్టును కోరారు. 

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?
Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?