Dangerous Movie: వర్మకు బిగ్ షాక్... డేంజరస్ మూవీ విడుదల వాయిదా

Published : Apr 07, 2022, 03:21 PM ISTUpdated : Apr 07, 2022, 04:14 PM IST
Dangerous Movie: వర్మకు బిగ్ షాక్... డేంజరస్ మూవీ విడుదల వాయిదా

సారాంశం

రామ్ గోపాల్ వర్మ డేంజరస్ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. థియేటర్ యాజమాన్యాలు సహకరించకపోవడంతో మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తెలియజేశారు.   

వర్మ (Ram Gopal Varma) లేటెస్ట్ మూవీ డేంజరస్. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలలో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ప్రేమ కాన్సెప్ట్ తో వర్మ డేంజరస్ తెరకెక్కించాడు. దేశంలోనే మొదటి లెస్బియన్ చిత్రంగా దీన్ని ఆయన చెబుతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా మొత్తం ఐదు ప్రధాన భాషల్లో ఈ చిత్ర విడుదలకు సన్నాహాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్మ విరివిగా ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేశారు. వివిధ నగరాలకు తన ఇద్దరు హీరోయిన్స్ తో వెళ్లి ప్రచారం కల్పించారు. 

ఏప్రిల్ 8న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైన డేంజరస్ (Dangerous)చిత్రానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ పెద్ద షాక్ ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద థియేటర్స్ చైన్ గా ఉన్న ఈ రెండు సంస్థలు తమ థియేటర్స్ లో డేంజరస్ ప్రదర్శించడం కుదరదంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సదరు సంస్థలను వర్మ ఒప్పించే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో తన అసహనం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లెస్బియన్ వివాహాలకు, రిలేషన్షిప్స్ కి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వగా.. ఆ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ప్రదర్శన నిరాకరించడం ఏమిటంటూ వర్మ ప్రశ్నిస్తున్నారు. ఇది సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకించడమే అంటున్నారు. 

ఎంతకీ వర్మ ప్రయత్నాలు ఫలించకపోవడంతో డేంజరస్ మూవీ వాయిదా వేయక తప్పలేదు. వర్మ ట్విట్టర్ లో డేంజరస్ మూవీ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. లెస్బియన్ మూవీ అయిన కారణంగా అనేక థియేటర్స్ ప్రదర్సించమంటూ సహాయనిరాకరణకు దిగాయి. దీంతో డేంజరస్ మూవీ వాయిదా వేస్తున్నాము. దీనిపై న్యాయపోరాటం చేసి కొత్త విడుదల తేదీతో వస్తామని వర్మ తెలియజేశారు. వర్మ తెరకెక్కించిన డేంజరస్ మూవీ ప్రోమోలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక సాధారణంగా వర్మ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి తెలివిగా ఎక్కువ టికెట్ ప్రెస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేస్తారు. ఈసారి ఆయన డేంజరస్ చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

మరోవైపు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ కు వెళ్లి ఈ చిత్రం విడుదలను నిలుపుదల చేయిస్తూ కోర్ట్ స్టే ఆర్డర్ తీసుకుని వచ్చారు. ఎవరైనా ఈ చిత్రాన్ని ప్రదర్శించినా ప్రదర్శనకు సహకరించినా కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ అవుతుందని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం