KGF2: రాజమౌళి సర్ మొదలు పెట్టారు.. నన్ను వాళ్ళతో పోల్చొద్దు, యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Apr 07, 2022, 08:00 AM IST
KGF2: రాజమౌళి సర్ మొదలు పెట్టారు.. నన్ను వాళ్ళతో పోల్చొద్దు, యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సారాంశం

బాహుబలి ఆ తర్వాత కేజిఎఫ్.. ఈ రెండు చిత్రాల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. ప్రాంతీయ భాషా చిత్రాలుగా తెరకెక్కిన ఈ రెండు మూవీస్ దేశం మొత్తం ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అని బాలీవుడ్ సైతం ఆశ్చర్యంలో మునిగిపోయింది.

బాహుబలి ఆ తర్వాత కేజిఎఫ్.. ఈ రెండు చిత్రాల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. ప్రాంతీయ భాషా చిత్రాలుగా తెరకెక్కిన ఈ రెండు మూవీస్ దేశం మొత్తం ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అని బాలీవుడ్ సైతం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

1000 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. మరో వారం రోజుల్లో కేజిఎఫ్ 2 బాక్సాఫీస్ దాడికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీ మరోసారి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. హీరో యష్ ప్రస్తుతం కేజిఎఫ్ 2 ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో యష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో యాంకర్ యష్ ని బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్, సల్మాన్ ఖాన్ లతో పోల్చుతూ ప్రశంసించింది. నన్ను అంత పెద్ద స్టార్స్ తో పోల్చకండి. వారు ఇండస్ట్రీకి మూలస్థంబాలు లాంటి వారు. అలాంటి వారితో నన్ను పోల్చడం సరికాదు. నేను వారిని చూసే ఇండస్ట్రీకి వచ్చాను అని యష్ తెలిపాడు. 

కేజిఎఫ్ 2 చిత్రాన్ని శాండల్ వుడ్ సినిమా, కన్నడ సినిమా అని భావించడం సరి కాదు. ఇది ఇండియన్ సినిమా. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంతా వేరు కాదు. మొత్తం మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే. సినిమాకి భాషతో సంబంధం లేదు. కంటెంట్ బావుంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా సినిమాకు ఆదరణ ఉంటుంది. 

ఈ విధానాన్ని రాజమౌళి సర్ ప్రారంభించారు. మేము కంటిన్యూ చేస్తున్నాం అని యష్ తెలిపాడు. భాష ఏంటనేది ముఖ్యం కాదు. సినిమా నుంచి ప్రేక్షకులు మంచి అనుభూతి, వినోదం కోరుకుంటారు. అది ఏ భాషా చిత్రం అయినా పర్వాలేదు అని యష్ పేర్కొన్నాడు. కేజీఎఫ్ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు