మాస్టర్ ఓటిటి రైట్స్ అమెజాన్ కే...కాకపోతే!

Published : Nov 28, 2020, 12:55 PM IST
మాస్టర్ ఓటిటి రైట్స్ అమెజాన్ కే...కాకపోతే!

సారాంశం

మాస్టర్ ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. ఫ్యాన్సీ ప్రైస్ చెల్లించి మాస్టర్ మూవీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ త్వరలో స్ట్రీమ్ చేయనుంది. కానీ మూవీ విడుదల మాత్రం థియేటర్స్ లోనే అట. విడుదల తరువాత అమెజాన్ ప్రైమ్ లో మాస్టర్ అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజులలో థియేటర్స్ తెరుచుకోనుండగా, మాస్టర్ గ్రాండ్ గా విడుదల కానుంది.   

దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ పై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు లోకేష్ కనకరాజ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం మాస్టర్. ఖైదీతో లోకేష్ కనకరాజ్, బిగిల్ మూవీతో విజయ్ భారీ విజయాలు అందుకొని ఉన్నారు. కాంబినేషన్ రీత్యా ఈ మూవీపై పాజిటివ్ బజ్ భారీగా నడుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మాస్టర్ ఓటిటి లో విడుదల అవుతుందని ప్రచారం జరుగగా, చిత్ర యూనిట్ ఖండించాయి. 

అయితే ఇప్పటికే మాస్టర్ ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. ఫ్యాన్సీ ప్రైస్ చెల్లించి మాస్టర్ మూవీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ త్వరలో స్ట్రీమ్ చేయనుంది. కానీ మూవీ విడుదల మాత్రం థియేటర్స్ లోనే అట. విడుదల తరువాత అమెజాన్ ప్రైమ్ లో మాస్టర్ అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజులలో థియేటర్స్ తెరుచుకోనుండగా, మాస్టర్ గ్రాండ్ గా విడుదల కానుంది. 

జేవియర్ బ్రిట్టో నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించారు. ఇక హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం విశేషం. బలమైన ఇద్దరు ప్రత్యర్థులుగా వీరి మధ్య యాక్షన్ ఓ రేంజ్ లో ఉండనుంది. ఇటీవల విడుదలైన మాస్టర్ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. 40 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న ఈ టీజర్ సౌత్ ఇండియా రికార్డు నెలకొల్పింది. మాస్టర్ మూవీకి సంగీతం అనిరుధ్ సమకూర్చారు. 

PREV
click me!

Recommended Stories

Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ఆ కారణంతోనే జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర కనిపించట్లేదు: కమెడియన్ వెంకీ