Latest Videos

అఫీషియల్ గా దేవర రిలీజ్ డేట్ లో మార్పు.. సముద్ర తీరాన్ని ఎరుపెక్కించబోతున్న ఎన్టీఆర్..

By tirumala ANFirst Published Jun 13, 2024, 7:22 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కొరటాల శివ రూపొందిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే. కంప్లీట్ గా ఎన్టీఆర్ క్రేజ్ ని నమ్ముకుని దాదాపు 400 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కొరటాల శివ రూపొందిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే. కంప్లీట్ గా ఎన్టీఆర్ క్రేజ్ ని నమ్ముకుని దాదాపు 400 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. 

కానీ ఇప్పుడు అఫీషియల్ గా దేవర చిత్ర రిలీజ్ డేట్ మారింది. ఈ మార్పు యంగ్ టైగర్ ఫాన్స్ కి పండగ తీసుకువచ్చేదే అని చెప్పొచ్చు. అనుకున్న సమయం కంటే రెండు వారాల ముందుగానే దేవర చిత్రం రిలీజ్ అవుతోంది. దేవర పార్ట్ 1ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. 

అన్ని తీరా ప్రాంతాలకి ముందస్తు హెచ్చరిక.. దేవర సెప్టెంబర్ 27న వస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ టేకింగ్, ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజన్స్ తో పాన్ ఇండియా వైడ్ గా దేవర చిత్రం బాక్సాఫీస్ సునామి సృష్టించడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

Sending a Warning Notice to all coasts about his early arrival ⚠️⚠️

Man of Masses 's in cinemas from 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟕𝐭𝐡! 🔥🔥 🌊 … pic.twitter.com/eHlPQ6Z89M

— NTR Arts (@NTRArtsOfficial)

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే కొన్ని గ్రామాలకు దేవర రక్షకుడిగా ఉంటాడని.. 10 వేలమంది నరరూప రాక్షసులతో పోరాడతాడని.. ఈ చిత్ర కథ గురించి గతంలో లీకులు వచ్చాయి. 

click me!