బాలయ్య నెక్ట్స్ సినిమాలో విలన్ గా హీరో కుమార్తె!

Published : May 09, 2019, 03:24 PM IST
బాలయ్య నెక్ట్స్ సినిమాలో విలన్ గా హీరో కుమార్తె!

సారాంశం

యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా  నందమూరి బాలకృష్ణ కుర్ర హీరోలకు  సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. 

యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా  నందమూరి బాలకృష్ణ కుర్ర హీరోలకు  సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం తన తండ్రి బయోపిక్ గా వచ్చిన కథానాయకుడు, మహా నాయకుడు చిత్రాలతో పలకరించిన ఆయన ఇప్పుడు కెఎస్ రవి కుమార్ సినిమాకు సంతకం చేసాడు. ఇప్పటికే స్క్రిప్టు  పూర్తి అయిన ఈ చిత్రం  షూటింగ్ త్వరలో పాల్గొననున్నారు.   ఇందులోభాగంగా ఈనెల 17న పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో  పాత్రల ఎంపికను పూర్తి చేస్తోంది టీమ్.  అందుతున్న సమాచారం మేరకు తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ సినిమాలో కీ రోల్ చేయనుంది.  నెగిటివ్ పాత్రలో ఆమెను చూపించనున్నారు.  మరో ప్రక్క జగపతిబాబును మెయిన్ విలన్ గా ఎంపిక చేసారని తెలుస్తోంది. ఇందులో విలన్ రోల్‌ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని సమాచారం. 

అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా హరిప్రియను తీసుకున్నారని చెప్తున్నారు. హరిప్రియ, బాలయ్య ఇంతకు ముందు జయసింహ చిత్రంలో కనిపించారు.  అన్ని పద్దతి ప్రకారం జరిగితే వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలన్నది దర్శక,నిర్మాతల ప్లాన్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానుందట.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా