పిలిస్తే రాలేదని.. హీరోయిన్ పై హీరో కక్ష!

Published : May 09, 2019, 03:17 PM IST
పిలిస్తే రాలేదని.. హీరోయిన్ పై హీరో కక్ష!

సారాంశం

తెలుగు ఇండస్ట్రీలో హిట్స్ లేక బాధపడుతున్న ఓ హీరోయిన్ తన అప్ కమింగ్ ఫిలింతో సక్సెస్ అందుకోవాలని పరితపిస్తోంది. 

తెలుగు ఇండస్ట్రీలో హిట్స్ లేక బాధపడుతున్న ఓ హీరోయిన్ తన అప్ కమింగ్ ఫిలింతో సక్సెస్ అందుకోవాలని పరితపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ సినిమా హీరోతో అమ్మడి గొడవ కారణంగా ఇబ్బందుల్లో పడింది.

నిజానికి ఇప్పటికే సినిమా విడుదల కావాల్సివుంది కానీ వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా వేసవి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో హీరో.. హీరోయిన్ ని డేట్ కి వెళ్దామని పిలిచాడట. కానీ దానికి ఆమె అంగీకరించలేదట.

పైగా ఆ హీరో తన చుట్టూనే తిరుగుతున్నాడని యూనిట్ మెంబర్స్ లో కొందరికి చెప్పిందట. ఈ విషయం సదరు హీరోకి తెలియడంతో అతడి ఈగో హర్ట్ అయిందట. దీంతో ఆమెపై కక్ష సాధించడం కోసం సినిమాలో ఆమె పాత్రను చాలా వరకు ఎడిట్ చేయించినట్లు సమాచారం.

చాలా సమయం పాటు ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కేవలం పాటల మినహా, హీరోయిన్ కనిపించే సన్నివేశాలను కత్తిరించినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో కచ్చితంగా హిట్ అవుతుందని.. అందులో హీరోయిన్ కి క్రెడిట్ దక్కకూడదని ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా