Varalaxmi First Look : పాన్ ఇండియన్ మూవీ ‘హనుమాన్’ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్..

Published : Mar 04, 2022, 11:16 AM IST
Varalaxmi First Look : పాన్ ఇండియన్ మూవీ ‘హనుమాన్’ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్..

సారాంశం

నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) సినిమాల పరంగా జోరు పెంచేసింది. తమిళ్, కన్నడలోనే  కాకుండా ఇటు తెలుగులోనూ  వరుస సినిమాలు చేస్తోంది. తాజా తన పుట్టిన రోజు సందర్భంగా పాన్ ఇండియన్ మూవీ ‘హనుమాన్’ నుంచి వరలక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.   

ప్రతి సినిమాలన్నీ పాన్ ఇండియా బాట పట్టాయి. నార్త్, సౌత్ అనే తేడాలేకుండా ఇండియా అంతటా తమ సినిమాను ఆడించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే  సైరా నర్సింహరెడ్డి,  పుష్ఫ, వలిమై,  రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, ఇటీవల రిలీజ్ అయిన గంగూబాయి కతియావాడి వరకు అన్ని భాషల్లోని సినిమాలను పాన్ ఇండియన్ మూవీలుగానే రిలీజ్ చేస్తున్నారు. ఇదే బాటలో టాలీవుడ్ నుంచి మరోమూవీ కూడా రాబోతోంది. పాన్ ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో మూవీగా ‘హనుమాన్’  చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్ట్ చేశాడు. హీరోగా తేజ సజ్జ (Teja Sajja), అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత నిరంజన్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి  7న రిలీజ్ చేయనున్నట్టు గతంలో వెల్లడించారు. కానీ డేట్ మారే అవకాశం ఉంది. 

తాజాగా ఈ మూవీని నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రేపు ఆమె పుట్టిన రోజు సందర్భంగా అడ్వాన్స్డ్ గా బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ‘అంజమ్మ’ అనే మాస్ రోల్ లో నటించింది. ఎప్పటిలాగే వరలక్ష్మి తనలోని మాస్ యాంగిల్ ను ప్రదర్శించింది. ఎర్రటి పట్టుచీరలో పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న ఆమె కొబ్బరికాయల గుత్తిలో రౌడీలను చితకబాదుతున్నట్టు పోస్టర్ తెలియజేస్తోంది. పోస్టర్ ను బట్టి చూస్తే వరలక్ష్మి మరోసారి తనలోని మాసిజాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. చివరిగా ‘క్రాక్’(Krack) సినిమాలో జయమ్మగా  తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. 

 

కల్కి, జాంబిరెడ్డితో మంచి హిట్టు సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈసారి ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు ప్రశాంత్. ఈ మూవీతో పాటు మిల్క్ బ్యూటీ తమన్న (Tamannah)తోనూ ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’మూవీని తెరకెక్కిస్తున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ రానున్నాయి. తమన్న ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న  హిందీ చిత్రంలో నటిస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు