ఆస్కార్‌ విన్నింగ్‌ ప్రొడ్యూసర్‌ అలన్‌ లాడ్‌ కన్నుమూత

Published : Mar 04, 2022, 08:08 AM IST
ఆస్కార్‌ విన్నింగ్‌ ప్రొడ్యూసర్‌ అలన్‌ లాడ్‌ కన్నుమూత

సారాంశం

`స్టార్‌ వార్స్`, `బ్రేవ్‌ హార్ట్` వంటి చిత్రాలతో ఆస్కార్‌ అవార్డులను అందుకున్న దిగ్గజ హాలీవుడ్‌ నిర్మాత అలన్‌ లాడ్‌ కన్నుమూశారు. 

ఆస్కార్ విన్నింగ్‌ ప్రొడ్యూసర్‌, హాలీవుడ్‌ నిర్మాత అలన్‌ లాడ్‌ జూనియర్‌(84)(Alan Ladd) కన్నుమూశారు. ఈ విషయాన్ని లాడ్‌ కుమార్తే అమందా లాడ్‌ జోనాస్‌ ఫేస్‌ బుక్‌ ద్వారా వెల్లడించారు. బుధవారం ఆయన మరణించినట్టు తెలిపారు. హలీవుడ్‌ దిగ్గజ ప్రొడక్షన్‌ హౌజ్‌అయిన `20వ సెంచరీ ఫాక్స్` సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు అలన్‌ లాడ్‌. ఆయన ఆయన ఆస్కార్‌ అందుకున్న చిత్రాల్లో `స్టార్‌వార్స్`, `బ్రేవ్‌ హార్ట్` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. 

అలన్‌ లాడ్‌ తండ్రి స్టంట్‌మ్యాన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఫిల్మ్ బిజినెస్‌ స్టార్ట్ చేశారు. దాన్ని అలన్‌లాడ్‌ కొనసాగిస్తూ వచ్చారు. లాడ్‌ ఫాక్స్, ఎంజీఎం సంస్థలకు హెడ్‌గానూ పనిచేవారు. ఆయన్ని ముద్దుగా హాలీవుడ్‌ `లడ్డీ`గా పిలుచుకుంటారు. తన కెరీర్‌లో అనేక బెస్ట్ చిత్రాలను ప్రపంచ ఆడియెన్స్ కి అందించారు లాడ్‌. అందులో ప్రధానంగా 14 సినిమాలు ది బెస్ట్ గా నిలిచాయి. వాటిలో `యంగ్‌ ఫ్రాంకెన్‌స్టీన్‌`, `ది రాకీ హర్రర్‌ పిక్చర్‌ షో`, `చారియట్స్ ఆఫ్‌ ఫైర్‌`, `బ్రేడ్‌ రన్నర్‌`, `స్టార్ వార్స్` చిత్రాలున్నాయి. వీటితోపాటు సొంతంగా నిర్మాగా ``వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ అమెరికా`, `ది రైట్‌ స్టఫ్‌`, `గోన్‌ బేబీ బోన్‌`, `బ్రేవ్‌హార్ట్` చిత్రాలున్నాయి. `బ్రేవ్‌హార్ట్` సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అందుకున్న విషయం తెలిసిందే.

అంతేకాదు ఆయన సారథ్యంలో వచ్చిన సినిమాల్లో సినిమాలు దాదాపు 50 ఆస్కార్‌ అవార్డులను అందుకున్నాయి. 150 సినిమాలు నామినేట్‌ అయ్యాయి. అలన్‌ లాడ్‌.. హీరోలకు సానుకూలంగా ఉంటారు. అందుకే ఆయన్ని అనేక మంది స్టార్స్, మేకర్స్  ఇష్టపడుతుంటారు. ఎస్వైర్‌ మేగజీన్‌ ఏకంగా 1978లో ఆయన్నీ కీర్తిస్తూ `ట్రంఫ్‌ ఆఫ్‌ ది లైడ్‌ బ్యాక్‌ స్టైల్‌`గా వర్ణించింది. కవర్‌ పేజ్‌పై ప్రింట్‌ చేయడం విశేషం.ఇక అలన్‌ లాడ్‌ మృతి పట్ల హాలీవుడ్‌ సినిమా సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన మరణం ప్రపంచ సినిమాకి తీరని లోటని విచారం వ్యక్తం చేస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు