చంపాల్సివస్తే అది విశాల్ నే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్!

Published : Dec 18, 2018, 11:54 AM IST
చంపాల్సివస్తే అది విశాల్ నే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్!

సారాంశం

కోలివుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ తను ఎవరినైనా చంపాల్సివస్తే అది విశాల్ నే అని అంటోంది. అదేంటి ఇద్దరూ మంచి స్నేహితులు కదా మరి వరలక్ష్మీ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందని అనుకుంటున్నారా..? 

కోలివుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ తను ఎవరినైనా చంపాల్సివస్తే అది విశాల్ నే అని అంటోంది. అదేంటి ఇద్దరూ మంచి స్నేహితులు కదా మరి వరలక్ష్మీ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందని అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వస్తే ఇటీవల వరలక్ష్మీ ఓ అవార్డు వేడుక కార్యక్రమంలో పాల్గొంది.

అక్కడ ఒక వ్యాఖ్యాత ఆమెను ఓ ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. ఒక ముద్దు ఇవ్వాల్సివస్తే, ఒకరిని చంపాల్సివస్తే, ఒకరిని పెళ్లి చేసుకోవాలనిపిస్తే మీ ఛాయిస్ ఎవరని అడిగాడు. దానికి వరలక్ష్మీ తడుముకోకుండా ముద్దు ఇవ్వాల్సివస్తే అది శింబుకి ఇస్తా అని, చంపాల్సివస్తే అది విశాల్ నేనని అంది.

పెళ్లి మాత్రం వేరొకరిని చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హీరోయిన్ పాత్రలతో పాటు మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ పాత్రలు అలానే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తోంది. 

ప్రస్తుతం ఆమె నటించిన 'మారి-2' సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌