విశాల్ ని పెళ్లి చేసుకోమని చాలా సార్లు చెప్పా.. హీరోయిన్ కామెంట్స్!

Published : Oct 20, 2018, 10:25 AM ISTUpdated : Oct 20, 2018, 10:26 AM IST
విశాల్ ని పెళ్లి చేసుకోమని చాలా సార్లు చెప్పా.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

తమిళ హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మంచి స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి. కానీ వాటిల్లో నిజం లేదని చెబుతుంటుంది ఈ జంట. తాజాగా మరోసారి అటువంటి కామెంట్సే చేసింది నటి వరలక్ష్మీ.

విశాల్ హీరోగా నటించిన 'పందెంకోడి2' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకి జంటగా కీర్తి సురేష్ నటించగా.. ప్రతినాయకి పాత్రలో వరలక్ష్మి నటించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో.. నటుడు విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ఆమెని ప్రశ్నించగా.. ఇదే ప్రశ్న ఆయన్ని పలుమార్లు అడిగినట్లు చెప్పింది. ఇలా కాలం గడిచిపోతే ఆ తరువాత పెళ్లి చేసుకుందామన్నా.. ఎవరూ పిల్లని ఇవ్వరని కూడా చెప్పానని వెల్లడించింది.

విశాల్ మాత్రం నడిగర్ సంఘం భవన నిర్మాణం తరువాతనే పెళ్లి చేసుకుంటాననే విషయంలో దృఢంగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్.. విజయ్ నటిస్తోన్న 'సర్కార్' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా