సైకిల్ తొక్కడం రాదు..కాని బుల్లెట్ పై రచ్చ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. వైరల్ అవుతున్న వీడియో..

Published : Jun 07, 2023, 09:09 AM ISTUpdated : Jun 07, 2023, 09:11 AM IST
సైకిల్ తొక్కడం రాదు..కాని బుల్లెట్ పై రచ్చ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. వైరల్ అవుతున్న వీడియో..

సారాంశం

సైకిల్ తొక్కడమే రాదు.. కాని డైరెక్ట్ గా బుల్లెట్ బండేసుకుని రైడ్ కు బయలుదేరింది తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. 

డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్లలో ముందు వినిపించే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. అందరు భామల్లా కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. హీరోయిన్ గా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇంపార్టెంట్ ఉన్న పాత్రల్లో మెరుస్తుంటుంది బ్యూటీ. అంతే కాదు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీకి ధైర్యం చాలా ఎక్కువ. సినిమాల్లో కాని.. బయట కాని తనది బేస్ ఉన్నవాయిస్.. బేస్ ఉన్న యాటీట్యూడ్. తప్పు చేయకుండా ఎవరైనా తన దగ్గర ఎక్కవు చేస్తే.. వారు ఎంతటివారైనా భరతం పడుతుందట వరలక్ష్మీ. ఓసారి తిక్క తిక్కగా వాగిన పోలీస్ పైనే చేయి చేసుకుందట ఫైర్ బ్రాండ్. 

ఇక వరలక్ష్మి సినిమాల్లో ఆమెవిలక్షణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనలేదు. సర్కార్, తెనాలి రామకృష్ణ లాంటి సినిమాల్లో ఆమె విలనిజం చూసే ఉన్నాం. ఇక  ఇప్పుడు వరలక్ష్మి పర్సనల్ లైఫ్ గురించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత డేరింగా ఉండే వరలక్ష్మికి ఇప్పటి వరకూ సైకిల్ తొక్కడం కూడా రాదట. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటుంది బ్యూటీ. కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఇప్పటి వరకూ సైకిల్ లాంటివి నడపడానికి ఇంట్లోనుంచి పర్మీషన్ రాలేదు అంటోంది వరలక్ష్మి. 

 

ఇక తాజాగా తాను సైకిల్ నేర్చుకుని.. ఆతరువాత స్కూటీ నడపడం నేర్చుకుని.. ఆ వెంటనే బుల్లెట్ బండి కూడా నడిపేస్తున్నాను అన్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా తాను సైకిల్, స్కూటీ నేర్చుకుని... బుల్లెట్ రైడ్ కూడా చేస్తున్న వీడియో తన సోషల్ మీడియాలో శేర్ చేసింది బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోకు రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. వరలక్ష్మి పట్టదలను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లే. 

ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు, తమిళ,మలయాళ భాషల్లో నటించిన దాదాపు డజనకు పైగా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతునాయి. తెలుగులో తేజ్ సజ్జా  మీరోగా నటించిన హనుమాన్ మూవీతో పాటు తాను లీడ్ రోల్ చేస్తున్న మరో సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఇకవరుస సినిమాలతో దూసుకుపోతోంది వరలక్ష్మీ టాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?