కార్తికేయ కిల్లర్ లుక్.. వలిమై నుండి ఫస్ట్ లుక్ ఔట్!

Published : Sep 21, 2021, 02:09 PM ISTUpdated : Sep 21, 2021, 02:11 PM IST
కార్తికేయ కిల్లర్ లుక్.. వలిమై నుండి ఫస్ట్ లుక్ ఔట్!

సారాంశం

అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న వలిమై. ఈ చిత్రం లో  కార్తికేయ ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నారు. నేడు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వలిమై టీమ్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఓ పక్క హీరోగా వరుస చిత్రాలు చేస్తున్న కార్తికేయ, అవకాశం వస్తే నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం మొదటిసారి విలన్ గా మారిన కార్తికేయ, మరోసారి విలన్ అవతారం ఎత్తారు. అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న వలిమై. ఈ చిత్రం లో  కార్తికేయ ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నారు. నేడు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వలిమై టీమ్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చేతిలో వాకీ టాకీ, మందు బాటిల్ తో, పోస్టర్ లో కార్తికేయ చాలా రఫ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.


ఈ చిత్రం లో బాలీవుడ్ భామ హుమా ఖురేషి మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. బోని కపూర్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

ఇక చావు కబురు చల్లగా కార్తికేయ నటించిన గత చిత్రం కాగా, రాజావిక్రమార్క అంటూ తదుపరి చిత్రంతో పలరించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ, ఎన్ ఐ ఏ ఏజెంట్ రోల్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా