ప్రభాస్ లాగా కొట్టాలనిపిస్తుంది, కానీ.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేసిన వైష్ణవ్

By telugu team  |  First Published Oct 7, 2021, 7:51 PM IST

డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన రెండవ చిత్రంతో అలరించేందుకు 'కొండపొలం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన రెండవ చిత్రంతో అలరించేందుకు 'కొండపొలం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రతిభగల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. కీరవాణి సంగీత సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. Panja Vaisshnav Tej కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్ర విశేషాలు పంచుకుంటున్నాడు. తన జీవితంలో ఎప్పుడూ కొండపొలం చూడలేదని.. క్రిష్ ఈ కథ చెప్పినప్పుడే కొత్త అనుభూతికి లోనైనట్లు వైష్ణవ్ పేర్కొన్నాడు. 

Latest Videos

undefined

సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. క్రిష్ చిత్రాలు చాలా లోతుగా ఉంటాయి. అలాంటి దర్శకుడితో పనిచేయడం గొప్ప అనుభూతి. పవన్ కళ్యాణ్ గారి అనుమతితో ఈ చిత్రం చేశాం. నా చిన్నప్పటి నుంచి ఆయన సపోర్ట్ ఉంది. రీసెంట్ గా కలిసినప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

Also Read: ప్రభాస్ కి అబద్దం చెప్పాడా..రామలక్ష్మణుల మధ్య చిచ్చు పెట్టిన బాలీవుడ్ హీరో

ఈ చిత్రంలో సాయి చంద్ గారి నటన అద్భుతం. అలాగే కోట శ్రీనివాసరావు గారు ఈ వయసులో స్పష్టంగా డైలుగులు చెప్పడంతో సెట్స్ లో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు అని వైష్ణవ్ తేజ్ తెలిపాడు. ఉప్పెన, కొండపొలం రెండు చిత్రాలు విభిన్నమైన చిత్రాలు. మూడవ చిత్రం కమర్షియల్ అంశాలతో తెరకెక్కే ప్రేమ కథ అని వైష్ణవ్ రివీల్ చేశాడు. 

స్టార్ హీరోల సినిమాలు చూసేటప్పుడు నాకు కూడా అలాంటి కమర్షియల్ కథలు ఎంచుకోవాలని ఉంటుంది. నాకు కూడా ప్రభాస్ లాగా కొట్టాలనిపిస్తుంది. ఇంట్లోవాళ్ళు కూడా నన్ను కమర్షియల్ చిత్రాల్లో చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్..తేజు ఆరోగ్యం గురించి కూడా మాట్లాడాడు. తేజు అన్నయ్య బావున్నాడు. ఫిజియో థెరపీ జరుగుతోంది. త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తాడు అని వైష్ణవ్ తేజ్ తెలిపాడు. 

click me!