క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘కొండపాలెం’ అనే ఒక సినిమా పూర్తి చేసాడు వైష్ణవ తేజ్. ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు ఇంటర్వూస్ లలో తెలిపారు. ఇప్పుడీ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.
వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’ను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. ‘ఉప్పెన’ భారీ కలెక్షన్లు సాధించి వైష్ణవ్ తేజ్ కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా మిగిలింది. ‘బుచ్చి బాబు’ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా పాండెమిక్ టైం లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాదించించి. ఒకే డెబ్యూ హీరోకి ఇది కొత్త రికార్డ్ గా నిలిచింది. ఈ సినిమా విడుదల అవకముందే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘కొండపాలెం’ అనే ఒక సినిమా పూర్తి చేసాడు వైష్ణవ తేజ్. ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు ఇంటర్వూస్ లలో తెలిపారు. ఇప్పుడీ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.
వివరాల్లోకి వెళితే... తొలి సినిమా ‘ఉప్పెన’ మొదలు కాకముందే.. దర్శకుడు క్రిష్‌తో కలిసి ఓ విభిన్నమైన సినిమా సైన్ చేశాడు వైష్ణవ్. అడివి నేపధ్యంలో సాగే ‘కొండపాలెం’ నవల ఆధారంగా.. ఈ సినిమా రూపొందించింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తైంది. అయితే సీజీ,విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా కాలం పట్టింది. అలాగే కరనో ఎఫెక్ట్ తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.
అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక డైరెక్టర్ క్రిష్ నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసారు. అలాగే ఈ సినిమాకు కొండపాలెం, జంగిల్ బుక్ టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. తొలుత ఈ చిత్రాన్ని ఓటీటిలోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు తెరకెక్కిస్తూనే.. షూటింగ్ గ్యాప్ లో ఈ సినిమాను పూర్తి చేశాడు క్రిష్. చాలా తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్. పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో ఈమె నటిస్తోంది.
ప్రస్తుతం వైష్ణవ తేజ్ హీరో గా రూపొందనున్న మూడవ సినిమా రీసెంట్ గా మొదలైంది. అర్జున్ రెడ్డి సినిమాని రూపొందించిన సందీప్ వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన గిరీశయ్య తమిళంలో అదే సినిమాని ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో రూపొందించి హిట్ సాధించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటించనున్న మూడవ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఉప్పెన ని మ్యూజికల్ హిట్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించనున్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా గురించి మిగతా అప్ డేట్స్ రానున్నాయి.