చిరంజీవి `వియ్‌ ఫర్‌ ఇండియా` ఫండ్‌రైజ్‌ ఈవెంట్‌కి అంతర్జాతీయ గుర్తింపు..

Published : Aug 17, 2021, 04:52 PM IST
చిరంజీవి `వియ్‌ ఫర్‌ ఇండియా` ఫండ్‌రైజ్‌ ఈవెంట్‌కి అంతర్జాతీయ గుర్తింపు..

సారాంశం

రిల‌యన్స్ సంస్థ ద్వారా జాతీయ, అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు `వియ్ ఫర్ ఇండియా` సంస్థ ద్వారా చారిటీ కార్య‌క్ర‌మం చేసి భార‌త‌దేశంలో కోవిడ్ కి సంబంధించిన ఫండ్ ని రైజ్ చేయాల‌ని ఆగ‌స్టు 15న ఓ ప్ర‌య‌త్నం చేయ‌గా ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు సేవ‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి వేవ్ స‌మ‌యంలో సినీకార్మికుల‌కు క‌ష్టంలో ఉన్న‌వారికి సాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాను చేప‌ట్టి ప్రాణ దాత అయ్యారు. అయితే ఈ సేవ‌ల‌కు జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కుతోంది. 

రిల‌యన్స్ సంస్థ ద్వారా జాతీయ, అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు `వియ్ ఫర్ ఇండియా` సంస్థ ద్వారా చారిటీ కార్య‌క్ర‌మం చేసి భార‌త‌దేశంలో కోవిడ్ కి సంబంధించిన ఫండ్ ని రైజ్ చేయాల‌ని ఆగ‌స్టు 15న ఓ ప్ర‌య‌త్నం చేయ‌గా ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 5 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల నిధిని సేక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ పోర్ట‌ల్ డెడ్ లైన్ డాట్ కాంలో ప్ర‌ముఖంగా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది.

ఇక కోవిడ్ స‌మ‌యంలో తాము చేసిన సేవ‌ల‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్య‌మాల లైవ్ వేదిక‌గా చిరు డెమో ఇచ్చారు. ఇలా చేసిన ప్ర‌ముఖుల్లో హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ స‌హా మెగాస్టార్ చిరంజీవి పేరు వైర‌ల్ అయ్యింది. ఈ జాబితాలో హృతిక్ రోష‌న్- అజ‌య్ దేవ‌గ‌ణ్‌ త‌దిత‌రులు ఉన్నారు. ఆగ‌స్టు 15 రాత్రి గ్లోబల్ ఫండ్ రైజర్ `వియ్ ఫర్ ఇండియా` భారతదేశంలో  కోవిడ్ బాధితుల సేవ‌కోసం నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేసింది.  

ఇది వర్చువల్ ఈవెంట్.. వినాశకరమైన వైరస్ పై దేశ పోరాటానికి సహాయపడటానికి  5మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌ను సమీకరించి గొప్ప విజ‌యం సాధించామ‌ని ఫండ్ రైజ‌ర్ సంస్థ ప్ర‌క‌టించింది. దీనికోసం పాపుల‌ర్ స్టార్లు ముందుకు రావ‌డం విశేషం. పశ్చిమ నుండి ప్రముఖ పేర్లతో సహా స్టీవెన్ స్పీల్‌బర్గ్ -మిక్ జాగర్ ప్రత్యేక మద్దతు సందేశాలను అందించారు. దేశంలోని ఒక మంచి కాజ్ కోసం ఇంత‌మంది గ్లోబ‌ల్ స్టార్లు నేను సైతం అంటూ ముందుకు రావ‌డం నిజంగా ఒక అద్భుతం అన్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?