యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఆదికేశవ’. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదలకు రెడీ చేశారు. తాజాగా డేట్ ఫిక్స్ చేస్తూ యూనిట్ అప్డేట్ అందించింది. ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసింది.
పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలిసినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాలు పరాజయం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. `ఆదికేశవ` అనే చిత్రంలో నటించారు. ఇందులో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) కథానాయిక. మలయాళ నటులు అపర్ణ దాస్, జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను యూనిట్ షురూ చేసింది. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పలు ఇంటర్వ్యూలో ఇవ్వడంతో పాటు, వైష్ణవ్, శ్రీలీలా బిగ్ బాస్ హౌజ్ లోనూ మెరిశారు. మరోవైపు చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈసారి వైష్ణశ్ కు హిట్ పడేట్టుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘ఆదివకేశవ’ నుంచి బిగ్ అప్డేట్ అందించారు చిత్ర యూనిట్.
undefined
Aadikeshava Trailerపై అనౌన్స్ మెంట్ చేశారు. యాక్షన్ - ప్యాక్డ్ రైడ్ తో థియేట్రికల్ ట్రైలర్ రాబోతుందని హైప్ పెంచారు. నవంబర్ 17న ఈ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. దీంతో వైష్ణవ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అనౌన్స్ మెంట్ తో విడుదల చేసిన పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. వైష్ణవ్ తేజ్ యంగ్రీ లుక్, రెండు చేతుల్లో కత్తుల పట్టుకొని ఇచ్చిన స్టిల్ ఆకట్టుకుంటోంది. మరోవైపు జోజు జార్జ్ మాస్ లుక్ కూడా అదిరింది.
ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డడ్లీ, ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నంబర్ 24న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.