వడివేలు అప్పీల్ తిరస్కరణ.. భారీ జరిమానా!

Published : Jun 12, 2019, 09:02 AM IST
వడివేలు అప్పీల్ తిరస్కరణ.. భారీ జరిమానా!

సారాంశం

కోలీవుడ్ సీనియర్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడివేలుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. ఆయన అప్పీల్ ని కొట్టివేయడమే కాకుండా జరిమానాను సకాలంలో చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. 

కోలీవుడ్ సీనియర్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడివేలుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. ఆయన అప్పీల్ ని కొట్టివేయడమే కాకుండా జరిమానాను సకాలంలో చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. 

నటుడిగా బారి పారితోషికాలు అందుకుంటూ పన్ను ఎగ్గొట్టినట్లు వడివేలు మీద ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖకు తప్పుడు లెక్కలు చూపించినట్లు తేలింది. ముఖ్యంగా 2010లో ఆయన రెమ్యునరేషన్ పెరిగినప్పటికీ కేవలం 4లక్షలు మాత్రమే అందుకుంటున్నట్లు లెక్కలు చూపించారు. 

ఐటి రెయిడ్ లో 50 లక్షల వరకు ఆయన లెక్క చూపకపోవడంతో  రూ.61.23 లక్షల జరిమానా విధించినట్లు నోటీసులు అందాయి. జరిమానా విధించిన ఐటి నిర్ణయానికి వడివేలు ఆదాయపు పన్ను శాఖ కమిటీలో అప్పీల్ చేశారు. తనకు నోటీసులు పంపడం కరెక్ట్ కాదని పిటిషన్ వేయగా ఆదాయపు పన్ను కమిటీ విచారణ జరిపింది.

పన్ను ఎగవేతకు పాల్పడటం నిజమని తేలింది కావున వడివేలు అప్పీల్ ని కొట్టి వేశారు. వీలైనంత త్వరగా వడివేలు జరిమానా చెల్లించాలని ఐటి కమిటీ ఆదేశాలు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?