
మలయాళీ చిత్రాలకు తెలుగు ఓటీటీ ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళీ థ్రిల్లర్ చిత్రాలని తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మరో సూపర్ హిట్ మలయాళీ మూవీ తెలుగు ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతోంది. ఆ చిత్రం పేరు వడక్కన్.
'వడక్కన్' (Vadakkan) చిత్రం హారర్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. త్వరలో తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మే 5, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళ భాషలో విడుదలైన ఈ చిత్రం, జూన్ 6, 2025న ఆహాలో తమిళ డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కానుంది. అదే విధంగా తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.
సజీద్ ఎ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కిషోర్, శృతి మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే కేరళలో ఒక రియాలిటీ టీవీ షో షూటింగ్ సమయంలో జరిగిన అనుమానాస్పద మరణాలు సంభవిస్తాయి. ఈ మరణాల వెనుక అతీంద్రియ శక్తులు ఉన్నాయని అనుమానాలు కలుగుతాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఇద్దరు వ్యక్తులు వస్తారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత ద్రవిడీయన్ ఫోక్‌లోర్‌కు చెందిన ఒక భయంకరమైన శక్తిని ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది మిగిలిన కథ.
తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, 'వడక్కన్' త్వరలోనే తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో విడుదల కానుంది. అయితే, అధికారికంగా విడుదల తేదీ మరియు ప్లాట్‌ఫార్మ్ వివరాలు ఇంకా ప్రకటించబడలేదు.
మార్చి 7న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. కథ, నటీనటుల నటన, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.