షాకింగ్.. హీరోగా వి.వి.వినాయక్!

Published : May 14, 2019, 10:03 AM IST
షాకింగ్.. హీరోగా వి.వి.వినాయక్!

సారాంశం

దర్శకుడు వి.వి.వినాయక్ ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడు. మీరు వింటున్నది నిజమే.. 

దర్శకుడు వి.వి.వినాయక్ ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడు. మీరు వింటున్నది నిజమే.. వినాయక్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆయన వయసు, ఫిజిక్ కి తగ్గట్లు ఓ మంచి స్క్రిప్ట్ రావడంతో వినాయక్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇంతకీ వినాయక్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలనే ఆలోచన ఎవరిదో తెలుసా..? ఈ ప్లానింగ్  మొత్తం నిర్మాత దిల్ రాజు చేస్తున్నాడు. దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన నరసింహారావు అనే కొత్త దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ నిర్మాత దిల్ రాజుకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది.

దాంతో ఆయన సోమవారం నాడు దర్శకుడు వినాయక్ కి నెరేషన్ ఇప్పించి ఆయనతో ఓకే చెప్పించుకున్నారట. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు 'మహర్షి' టీం తో కలిసి తిరుపతిలో ఉన్నాడు.

అక్కడే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. 'దిల్' సినిమా అప్పటినుండి కూడా వినాయక్ కి దిల్ రాజుకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు ఆ బంధంతోనే దిల్ రాజు హీరోగా చేయమన్నా రెడీ అయిపోతున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

korean kanakaraju Day 7 collections: వరుణ్ తేజ్ మూవీకి ఎదురుదెబ్బ, కొరియన్ కనకరాజు వారంలో ఎంత వసూలు చేసింది?
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్