`ఉస్తాద్‌ భగత్‌సింగ్‌` షూటింగ్‌ అప్‌డేట్‌.. అంతా తూచ్‌.. స్టార్ట్ అయ్యేది అప్పుడే?

Published : Aug 21, 2023, 08:14 PM IST
`ఉస్తాద్‌ భగత్‌సింగ్‌` షూటింగ్‌ అప్‌డేట్‌.. అంతా తూచ్‌.. స్టార్ట్ అయ్యేది అప్పుడే?

సారాంశం

 పవన్‌ కళ్యాణ్‌పై చిత్రీకరణ చేస్తున్నారనే ప్రచారం జరిగింది.   `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` షూటింగ్‌ సెట్‌లో కొత్త లుక్‌ అంటూ చక్కర్లు కొట్టింది. తాజాగా దీనిపై స్పందించింది యూనిట్‌.  

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్`, `ఓజీ`ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన షూటింగ్‌ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. పూజా హెగ్డే తప్పుకుంది. ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయ్యిందని, ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌పై చిత్రీకరణ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. నెట్టింట ఓ వార్త వైరల్‌ అయ్యింది. అంతేకాదు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` షూటింగ్‌ సెట్‌లో కొత్త లుక్‌ అంటూ చక్కర్లు కొట్టింది. తాజాగా దీనిపై స్పందించింది యూనిట్‌. వచ్చే నెల నుంచి కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపింది. 

`ఉస్తాద్‌ భగత్‌సింగ్‌` సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ సెప్టెంబర్‌ 5 నుంచి ప్రారంభమవుతుంది. భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసినట్టు వెల్లడించారు. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. అందుకోసం ఆర్ట్ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి డైరెక్షన్‌ళో భారీ సెట్‌ని వేసినట్టు తెలిపింది. దీంతో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతుందనే రూమర్స్ కి చెక్‌ పెట్టింది యూనిట్‌. ఇదిలా ఉంటే ఈ షూటింగ్‌ కోసం పవన్‌ ఏకంగా 30రోజుల డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ఇందులో పవన్‌తోపాటు ముఖ్య నటులు పాల్గొంటారట.

మరోవైపు పవన్‌ నటిస్తున్న మరో మూవీ `OG` నెక్ట్స్ షెడ్యూల్ కూడా బ్యాంకాక్ లో జరుగనుంది. ప్రీ క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత కేవలం ఫారెన్ షెడ్యూల్ మాత్రమే ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం ఆయన 15రోజుల డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఎన్నికలకు ముందు వీటిలో ఒక్క సినిమానైనా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. 

ఇక `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` పొలిటికల్‌ అంశాలతో రూపొందిస్తున్నారట. పొలిటికల్‌ సెటైరికల్‌గా ఉంటుందట. అయితే తన పాలసీని, తన నాయకత్వాన్ని హైలైట్‌ చేసేలా ఇందులో డైలాగ్‌లు, అంశాలుంటాయని సమాచారం. మరి నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు `ఓజీ` పూర్తి గ్యాంగ్‌స్టర్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. చాలా స్టయిలీష్‌గా ఉంటుందని సమాచారం. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?