అఫీషియల్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ బ్లాస్టింగ్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

By Asianet News  |  First Published May 6, 2023, 1:59 PM IST

దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రాబోతుందని, డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. 
 


పదేండ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీశ్ శంకర్  కాంబో సెట్ అయ్యింది. సినిమా పట్టాలెక్కుతుందా? లేదోననే ఊహాగానాల మధ్య ఎట్టకేళకు షూటింగ్ ను ప్రారంభించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ తో చిత్రీకరణ ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే Harish Shankar కూడా ఏమాత్రం సమయం వేస్ట్ కాకుండా సినిమాను తెరకెక్కించేలా వర్క్ చేస్తున్నారు. 

ఇప్పటికే చిత్రం  మొదటి షెడ్యూల్ పూర్తైన విషయం తెలిసిందే.  ఆ షెడ్యూల్ పూర్తయ్యిందే లేదో ఎప్పుడూ ఏదో అప్డేట్ ఇస్తూనే వస్తున్నారు. ఎడిటింగ్ ప్రారంభించినట్టు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ మీద కూర్చున్నారు. త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుండటంతో తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు. ఆ అప్డేట్ ను Devi Sri Prasad ద్వారా వెల్లడించారు. 

Latest Videos

Ustaad Bhagat Singh నుంచి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. మే 11న ఈ అప్డేట్ బ్లాస్ట్ కానుందని దేవీ మాటల్లో వినిపించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  పవన్, హరీశ్ శంకర్, దేవీశ్రీ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని డైలాగ్స్, సీన్లు, పాటలు, బీజీఎం ఏ రేంజ్లో హిట్ అయ్యిందో తెలిసిందే. 

మళ్లీ ఇదే కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సైతం రూపుదిద్దుకుంటుండటంతో అంచనాలు హైలో ఉన్నాయి. ప్రస్తుతం ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రెండో షెడ్యూల్ ప్రారంభించేందుకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ లోకేషన్స్ సర్చింగ్ లో ఉన్నారు. త్వరలోప్రారంభం కానుంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 2024లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Rockstar has some exciting news 🤩🤩

Let's celebrate a very special day with a blasting glimpse of on May 11th 💥💥

Mark the date 🔥🔥 pic.twitter.com/XTQl6QRxKy

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!