‘యాత్ర’ అక్కడ కలెక్షన్స్ బాగా పూర్

Published : Feb 12, 2019, 09:36 AM IST
‘యాత్ర’ అక్కడ కలెక్షన్స్ బాగా పూర్

సారాంశం

సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. 

సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల అయ్యింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం, సినిమా బాగుండటంతో  తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అదే సమయంలో అమెరికాలోనూ ఈ సినిమాని భారీగానే విడుదల చేసారు. అమెరికా వ్యాప్తంగా 140పైగా థియేటర్లలో విడుదలచేసారు.

అయితే అందుతున్న సమాచారం మేరకు అక్కడ కలెక్షన్స్ చెప్పుకోదగ్గ రీతిలో లేవు. అప్పటికి ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ మేజర్ వెబ్ సైట్స్ లలో ల్యాండిగ్ పేజిలో యాడ్ చ్చారు. టాక్ కూడా బాగుంది. అయితే ఇప్పటిదాకా కేవలం   $200k (రూ 70 లక్షలు) వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో ఏమన్నా కలక్షన్స్ పెరుగుతాయమో చూడాలంటున్నారు. 

ఇక ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టి పరకాయ ప్రవేశం చేయటం కలిసొచ్చింది. ఆయన ఆహార్యం, మాటతీరు అచ్చం రాజన్నలాగే ఉందంటూ వైఎస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హిట్ టాక్ రావడంతో  తెలుగు రెండు రాష్ట్రాల్లో సాధారణ రోజుల్లోనూ ‘యాత్ర’ స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్