అవయవదానం చేసిన మెగా అల్లుడు!

Published : Feb 11, 2019, 04:43 PM IST
అవయవదానం చేసిన మెగా అల్లుడు!

సారాంశం

మెగాస్టార్ చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

మెగాస్టార్ చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. ''ఈరోజు కోసం ఎదురుచూస్తున్నాను. 

ట్విట్టర్ లో ఉండడం సులువే కానీ ఏదైనా విలువైన అంశంతో ట్విట్టర్ ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకున్నాను. అందుకే నా వంతుగా అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో అవయవదానం చేశాను. ఎంతైనా.. మనం పోయేప్పుడు ఏమీ తీసుకుపోం కదా.. ప్రేమతో కళ్యాణ్ దేవ్'' అంటూ పోస్ట్ పెట్టాడు.

'విజేత' చిత్రంతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమాకు పులివాసు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం  అందిస్తోన్న ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం