
ఊర్వశి రౌతేలా పేరు చెప్పగానే బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4 లాంటి బోల్డ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. గ్లామర్ పాత్రలతో ఊర్వశి రౌతేలా బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేస్తూ అలరించింది. తెలుగులో ఊర్వశి రౌతేలా వాల్తేరు వీరయ్య, బ్రో లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
అయితే ఊర్వశి రౌతేలా తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఊర్వశి రౌతేలా బాత్ రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇప్పుడు ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా తన మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడింది. ఆ ఫోన్ కాల్ ఆడియో కూడా లీక్ కావడంతో అనుమానాలు మొదలయ్యాయి.
కావాలనే ఊర్వశి రౌతేలా చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోంది అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.ఊర్వశి రౌతేలా.. తన మేనేజర్ తో మాట్లాడుతూ.. నా బాత్ రూమ్ వీడియో ఎలా లీక్ అయింది. దానిని మీరు చూశారా అని ప్రశ్నించింది. దీనికి మేనేజర్ స్పందిస్తూ మన టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెబుతాడు. అసలు ఇందంతా ఎలా జరిగింది అంటూ ఊర్వశి అసహనం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం ఊర్వశి రౌతేలా నటించిన జె ఎన్ యు చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ కోసం ఊర్వశి ఇలా చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తోంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.