తండ్రైన 'ఉరి' నటుడు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య

Published : Mar 17, 2023, 04:50 PM IST
తండ్రైన 'ఉరి' నటుడు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య

సారాంశం

ప్రముఖ బుల్లితెర నటుడు మోహిత్ రైనా కుటుంబలో సంతోషం వెల్లివిరిసింది. 40 ఏళ్ల ఈ క్రేజీ నటుడు తొలిసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య అదితి శర్మ నేడు శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ప్రముఖ బుల్లితెర నటుడు మోహిత్ రైనా కుటుంబలో సంతోషం వెల్లివిరిసింది. 40 ఏళ్ల ఈ క్రేజీ నటుడు తొలిసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య అదితి శర్మ నేడు శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మోహిత్ రైనా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. 

'ఇప్పుడే మేము ముగ్గురం అయ్యాం. బేబీ గర్ల్ కి ఈ ప్రపంచంలోకి స్వాగతం చెబుతున్నాం' అని పోస్ట్ చేసి తన చిట్టి కుమార్తె లేలేత చేతిని పోస్ట్ చేశాడు. దీనితో సెలెబ్రిటీలు, అభిమానులు మోహిత్ రైనా, అదితి శర్మ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

మోహిత్ రైనా, అదితి శర్మ గత ఏడాది ప్రైవేట్ గా జరిగిన వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. మోహిత్, అదితి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతోనే వీరి పెళ్లి జరిగింది. 

 

మోహిత్ బుల్లితెరపై పాపులర్ యాక్టర్. దేవోమ్ కా దేవ్ మహాదేవ్ అనే టివి సిరీస్ తో మోహిత్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అలాగే సినిమాల్లో కూడా పాపులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన మోహిత్ దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కించిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి