ఆస్కార్ అఫీషియల్ గా ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫాలో అయ్యే ఇద్దరు ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా..?

Published : Mar 17, 2023, 02:47 PM ISTUpdated : Mar 17, 2023, 02:51 PM IST
ఆస్కార్ అఫీషియల్ గా ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫాలో అయ్యే ఇద్దరు ఇండియన్  హీరోలు ఎవరో తెలుసా..?

సారాంశం

ఇండియాలో గొప్పగొప్ప నటులు ఉన్నారు. ఆస్కార్ అంతకు ముందు అందుకున్నవారు ఉన్నారు. కాని ఆస్కార్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు మాత్రం అతి తక్కువ మంది ఉంటారు. ఇక మన ఇండియా నుంచి ఇద్దరే ఇద్దరు స్టార్లను ఆస్కార్ అఫియల్ గా ఫాలో అవుతుందట ఇంతకీ ఎవరా స్టార్లు. 

ఇండియాలో గొప్పగొప్ప నటులు ఉన్నారు. ఆస్కార్ అంతకు ముందు అందుకున్నవారు ఉన్నారు. కాని ఆస్కార్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు మాత్రం అతి తక్కువ మంది ఉంటారు. ఇక మన ఇండియా నుంచి ఇద్దరే ఇద్దరు స్టార్లను ఆస్కార్ అఫియల్ గా ఫాలో అవుతుందట ఇంతకీ ఎవరా స్టార్లు. 


ప్రపంచంలో ప్రతీ ఒక్క నటుడు కలలను కనేది ప్రతిష్టాత్మకంగా భావించే  ఆస్కార్ అవార్డుని అందుకోవాలని. దాని కోసం కొంత మంది ఎంతో కృషి చేస్తుంటారు. జీవితాంతం ప్రయత్నించినా అందుకోలేకపోయిన వారు ఉన్నారు. కాని ట్రిపుల్ ఆర్ టీమ్ అది సాధించి చూపించింది. టాలీవుడ్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఇక మన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈసినిమాతో గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు ఆర్ఆర్ఆర్ తో.  ఈ ఏడాది ఆస్కార్ పుణ్యమా అని  నాటు నాటు పాటతో ఇండియన్ సినీ ఇండస్ట్రీ పేరు గట్టిగా వినిపించింది. ఆస్కార్ గెలుచుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్ లో మన సినిమాలకు డిమాండ్ పెరిగింది.  అంతే కాదు నెక్ట్స్ రాజమౌళి మహేష్ తో చేయబోయే పాన్ వరల్డ్ సినిమాకు హాలీవుడ్ నుంచి కూడా సహాయం అందమోబోతుంది. 

 

ఇక ఈక్రమంలో ఆస్కార్ లో మన ఇండియన్స్ క్రేజ్ గురించి ఓన్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఆస్కార్ అఫీషియల్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో  కొంత మంది ఇంపార్టెంట్ యాక్టర్స్ ను మాత్రమే ఫాలో అవుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిస్టార్ హీరోలను ఫాలో అయ్యే ఆస్కార్.. ఇండియాకి సంబంధించిన ఇద్దరి హీరోలను మాత్రమే ఫాలో అవుతుంది. అందులో ఒకరు మన తెలుగు హీరో కావడం.. టాలీవుడ్ కుదగ్గిన అతి పెద్ద గౌరవంగా భావించ వచ్చు. ఆ హీరోలు ఎవరంటే RRR తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న ఎన్టీఆర్ ఒకరైతే, మరొకరు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. 

 

ఇండియా నుంచి ఈ ఇద్దరి హీరోలను మాత్రమే ఆస్కార్ అఫీషియల్ గా ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవుతోంది.  ఈ విషయంలో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అటు షారుఖ్ ఫ్యాన్స్  పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్ లో అడుగు పెట్టగా.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు అభిమానులు. రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో ప్రధానితో జరిగే ప్రోగ్రామ్ కోసం రాజధానిలో లాండ్ అయ్యారు. ఇక ఆస్కార్ విజేతలకు ఇండస్ట్రీలో వరుసగా సస్కారాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్