'ఉప్పెన' డైరక్టర్ కి నిర్మాతలు అదిరిపోయే గిప్ట్!

By Surya Prakash  |  First Published Feb 17, 2021, 4:32 PM IST

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపధ్యంలో అందరూ ఈ చిత్రం దర్శకుడు బుచ్చిబాబు సానా అని మెచ్చుకుంటున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు అయితే కలెక్షన్స్ పండగ చేసుకుంటూ,డైరక్టర్ కు ఓ మంచి గిప్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.

ముఖ్యంగా 'డియర్‌ కామ్రేడ్‌', 'సవ్యసాచి' సినిమాలతో కమర్షియల్ గా పూర్తి స్దాయిలో మునిగిన మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ను ఉప్పెన ఒడ్డున పడేసింది.  దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. దర్శకుడు సానా బుచ్చిబాబుకు స్పెషల్ గా గిప్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఆ గిప్ట్ ఏదనేది ఆప్షన్ అతనికే ఇచ్చారట. ఇల్లు లేదా కారులో ఏది కావాలో కోరుకోమని బుచ్చిబాబును అడిగినట్లు మీడియాలో వినిపిస్తోంది.  

ఈ సినిమా విజయంతో మరింత ఉత్సాహంగా వరస ప్రాజెక్టులు ఓకే చేస్తోంది ఈ బ్యానర్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా చెయ్యనున్నారు. నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నారు. అంతేకాదు నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. 

Latest Videos

ఇక మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్, నటసింహా నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా తన తర్వాతి‌ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లోనే చేయనున్నట్లు సమాచారం.

click me!