వైజాగ్ లో సందడి చేయనున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర!

Siva Kodati |  
Published : May 29, 2019, 04:45 PM IST
వైజాగ్ లో సందడి చేయనున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర!

సారాంశం

కన్నడనాట రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర త్వరలో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించనున్నాడు. గతంలో ఉపేంద్ర నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యేవి. ఈ మధ్యన ఉపేంద్ర కాస్త స్పీడు తగ్గించాడు. ఇదిలా ఉండగా ఉపేంద్ర తాజాగా నటించిన చిత్రం 'ఐ లవ్ యు'. 

కన్నడనాట రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర త్వరలో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించనున్నాడు. గతంలో ఉపేంద్ర నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యేవి. ఈ మధ్యన ఉపేంద్ర కాస్త స్పీడు తగ్గించాడు. ఇదిలా ఉండగా ఉపేంద్ర తాజాగా నటించిన చిత్రం 'ఐ లవ్ యు'. ఈ చిత్రానికి ఆర్. చంద్రు దర్శకుడు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లో చంద్రునే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇటీవల బెంగుళూరులో ఐ లవ్ యు చిత్ర ప్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏఈ కార్యక్రమానికి కర్ణాటక విద్యాశాఖా మంత్రి జిటి దేవెగౌడ, మాజీమంత్రి రేవణ్ణ హాజరయ్యారు. వీరితో పాటు కావాలి నియోజకవర్గం నుంచి వైసిపి తరుపున రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా హాజరై ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. 

దర్శకుడు చంద్రు మాట్లాడుతూ ఐ లవ్ యు చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14న 1000 స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. త్వరలో విశాఖ నగరంలో ఐ లవ్ యు చిత్ర తెలుగు పాటలని విడుదల చేయనున్నట్లు దర్శకుడు ప్రకటించారు. ఈ చిత్రంలో ఉపేంద్రకు జోడిగా రచితా రామ్ నటించింది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..