'కబ్జా' ట్రైలర్ కు KGFకు లింక్ ఏంటి?

Published : Mar 05, 2023, 12:52 PM ISTUpdated : Mar 05, 2023, 12:54 PM IST
  'కబ్జా' ట్రైలర్ కు KGFకు లింక్ ఏంటి?

సారాంశం

 ''చరిత్ర ఎప్పుడూ తెగి పడిన తలల కంటే, ఆ తలలను తీసిన చేతులనే పొగుడుతుంది. అలాంటి చెయ్యి సృష్టించిన కథే కబ్జా'


ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కబ్జా' ట్రైలర్ రిలీజై ట్రెండింగ్ లో ఉంది. ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు, ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాధ్యం' వంటి డైలాగ్స్ బాగున్నాయి. కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించగా.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించారు.  స్టార్ హీరోలు ఉపేంద్ర - సుదీప్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దివంగత నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా మార్చి 17న ఈ చిత్రాన్ని విడుదల కానుంది. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఈ ట్రైలర్ చూసినవారందరికీ కేజీఎఫ్ గుర్తుకురావటం విశేషం.
  
వాస్తవానవికి KGF ఘన విజయం సినిమా తర్వాత కన్నడ సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు రావడం మొదలయ్యనటంలో సందేహం లేదు.   ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్లు చూస్తుంటే KGF లాంటి సినిమా అనిపిస్తుంది అందరికి. ఇక ట్రైలర్ చూశాక కూడా అదే ఫీల్ వస్తుంది. కథ వేరైనా టేకింగ్, మేకింగ్ మాత్రం ఆల్మోస్ట్ KGF గుర్తొచ్చేలానే చేశారు. ఆ కలర్స్, సెట్స్, బ్యాక్ గ్రౌండ్ అంతా KGFనే గుర్తు చేస్తాయి. కొందరైతే డీ గ్రేడ్ కేజీఎఫ్ అంటున్నారు. మరికొందరు కేజీఎఫ్ కు ప్యారెడీ అంటున్నారు. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లు కలిసి కబ్జ సినిమాతో  వస్తున్నారు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించారు..

బ్రిటీష్ పాలనలో భారతదేశంలో మాఫియా పుట్టుక, వారి ఆగడాలు ఎదుగుదల వంటి వాటి గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొన్ని వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ స్క్రిప్టును రాసుకున్నారట. ''చరిత్ర ఎప్పుడూ తెగి పడిన తలల కంటే, ఆ తలలను తీసిన చేతులనే పొగుడుతుంది. అలాంటి చెయ్యి సృష్టించిన కథే కబ్జా'' అని ట్రైలర్ లో పేర్కొన్నారు.
 
ఇక ట్రైలర్ చూస్తుంటే.. ఇది స్వతంత్రం ముందు 1945లో జరిగిన కథ అని తెలుస్తుంది. ట్రైలర్ లో ఎక్కువగా ఎలివేషన్ షాట్స్ చూపించారు. కథ ఏంటో తెలియకుండా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ చూస్తే సుదీప్ పోలీసాఫీసర్, ఉపేంద్ర పోలీస్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగినట్టు తెలుస్తుంది. చరిత్ర తెగిపడిన తలల గురించి కంటే ఆ తలలని తీసిన చేతుల్నే పొగుడుతుంది. అలాంటి ఒక చెయ్యి సృష్టించిన కథే కబ్జ అంటూ ట్రైలర్ ని నడిపించారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. కోట శ్రీనివాసరావు చాలా రోజుల తర్వాత సినిమాల్లో కనపడటమే కాక మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్ర చేసారు. ప్రస్తుతం కబ్జ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?