టాలీవుడ్ లో ఆయా చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్ తో అలరించిన నటి తాజాగా పెళ్లి చేసుకుంది. ఈ మేరకు తన మ్యారేజ్ పిక్స్ ను అభిమానులతో పంచుకోవడం నెట్టింట వైరల్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలోని నటీనటులు కొన్నేండ్ల ప్రమోయణం తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. గతేడాది, ఈ ఏడాది ప్రారంభంలో స్టార్ నటీనటుల నుంచి చిన్న యాక్ట్రెస్ కూడా పెళ్లి పీటలు ఎక్కారు. ఇక తాజాగా టాలీవుడ్ నటి ప్రియాంక నల్కారి (Priyanka Nalkari) తాజాగా తన ప్రియుడితో సీక్రెట్ గా పెళ్లి పీటలు ఎక్కింది. అది కూడా మలేషియా వరకు వెళ్లి అక్కడి మురుగున్ టెంపుల్ లో పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలోనూ షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2010లో విడుదలైన ‘అందరి బంధువయ్యా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ప్రియాంక నల్కారి. ఆ తర్వాత .. సంథింగ్ సంథిగ్, నా సామీ రంగ, వెల్కమ్ టు అమెరికా, కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి వంటి కీలకపాత్రల్లో చిత్రాల్లో నటించి మెప్పించింది. లాక్ డౌన్ కు ముందుకు వచ్చిన తమిళ చిత్రం ‘కాంచన 3’లోనూ నటించి ఆకట్టుకుంది. అలాగే 2014 నుంచే తెలుగు, తమిళంలో బుల్లితెర షోల్లో సందడి చేస్తూనే వచ్చింది. టీవీ ప్రేక్షకుల్లో కాస్తా గుర్తింపు దక్కించుకుంది.
అయితే 2018లోనే తన ప్రియుడు, నటుడు రాహుల్ వర్మతో ప్రియాంక నల్కారి నిశ్చితార్థం కూడా పూర్తైంది. అప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా సీక్రెట్ గానే జరిగింది. ఆ తర్వాత నాలుగేండ్లకు ఇప్పుడు మళ్లీ రహస్యంగానే పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొంతకాలం ప్రేమలో మునిగి తేలిని ఈ జంటల కేరీర్ కారణంగానే పెళ్లిని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ప్రియాంక సోస్టు చేసిన ఫొటోస్ లో కనీసం కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో షాక్ అవుతున్నారు. ఏదేమైనా ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ దంపతులకు టీవీ ఆడియెన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక తమిళంలోనే సందడి చేస్తోంది. ఇక రాహులో కూడా ఆయా చిత్రాలల్లో నటించారు. కానీ గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది.