ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈచిత్ర రిలీజ్ పై ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన ‘ఫుష్ప : ది రైజ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సినిమాలోని పుష్పరాజ్ మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా చేరుకుంది. స్టార్ క్రికెటర్లు, పొలిటిషన్లు చిత్రంలోని డైలాగ్స్ ను తెగ ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పాటలూ దుమ్ములేపాయి. ఇలా ఈ చిత్రం గతేడాది ఐకానిక్ ఫిల్మ్ గానూ నిలిచిపోయింది. మరోవైపు అవార్డులను దక్కించుకుంది. ఇక ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది.
Pushpa The Rule చిత్ర యూనిట్ రీసెంట్ గా వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ పార్ట్ విడుదలైన తర్వాత చాలా సమయానికి షూటింగ్ ప్రారంభించినా ప్రస్తుతం పనులు చకాచకా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు టాక్ నడిచింది. అయితే ఈఏడాదే చిత్రాన్ని విడుదల చేస్తారని భావించినా.. టాక్ మాత్రం 2024 సంక్రాంతికి వెళ్లింది. ఇక తాజాగా అప్డేట్ ప్రకారం.. వచ్చే ఏఢాది సంక్రాంతికీ కాకుండా సమ్మర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ అప్డేట్ కూడా అందుతుందని అంటున్నారు. మరోవైపు సంక్రాంతి రిలీజ్ బరిలో ఇప్పటి నుంచే తెలుగు చిత్రాలు పోటీకి దిగుతున్నాయి. దీంతో ‘పుష్ప2’ కూడా సంక్రాంతికే రిలీజైతే.. ముఖ్యంగా నార్త్ లో బాలీవుడ్ స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తుందంటున్నారు. ఈక్రమంలో పుష్ప రిలీజ్ పై మరింత ఆసక్తి పెరుగుతోంది.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఓ స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేస్తారని అంటుున్నారు. అప్పుడే విడుదల తేదీపైనా క్లారిటీ వస్తుందని సమాచారం. రిలీజ్ విషయంలో మార్పు నిజమైతే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఫ్యాన్స్ ఆగాల్సిందేనని అంటున్నారు. ఏదేమైనా ఈచిత్రంపై ఇటు సౌత్, అటు నార్త్ లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాంట.
అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సునీల్, అనసూయ, జగదీష్ (కేశవ)తోపాటు pushpa2లో మరికొన్ని క్యారెక్టర్స్ కూడా యాడ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జగపతి బాబు ఓ కీలకపాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా చిత్రంపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్, శంకర్ రూ.350 కోట్ల వరకు వెచ్చించి గ్రాండ్ గా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.