#KUSHI: ‘ఖుషి’రీరిలీజ్ డేట్ ఫిక్స్, ఆ సినిమాతో పాటే.. ఇవి కూడా

Published : Sep 25, 2022, 07:54 AM IST
 #KUSHI: ‘ఖుషి’రీరిలీజ్ డేట్ ఫిక్స్, ఆ సినిమాతో పాటే.. ఇవి కూడా

సారాంశం

” మొదట ఖుషీ సినిమాను రీ రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ, అప్పటికే తమ్ముడు, జల్సా రిలీజ్ అవ్వడంతో ఒకేసారి అన్ని సినిమాలు ఎందుకు అని మౌనంగా ఉండిపోయాను.  ఖుషీ ని మాస్టర్ వెర్షన్ లో అభిమానులకు అందిస్తాను” అని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది.  స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తే వారి సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అవి ట్రెండింగ్ లో ఉంటన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి సినిమా విడుదలయి భారీ కలెక్షన్లను రాబట్టడంతో మహేష్ అభిమానులు సైతం తగ్గేదే అంటూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాని విడుదల చేశారు. జల్సా సినిమాతో పాటు తమ్ముడు సినిమాని కూడా అతి తక్కువ థియేటర్లలో విడుదల చేశారు.

జల్సా సినిమాని అత్యధిక థియేటర్లలో విడుదల చేయడంతో అభిమానులు సైతం పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చి సినిమాని ఎంతో విజయవంతం చేశారు.అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో జల్సా సినిమా కన్నా ఖుషి సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుందనేది కాదనలేని సత్యం. ఈ సినిమాని విడుదల చేయకుండా జల్సా సినిమాని ఎందుకు విడుదల చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.   ఖుషి సినిమా 4k ప్రింట్ సిద్ధం చేయడం కుదరక ఆగిందన్నారు. ఈ నేపధ్యంలో ఖుషీ ని రీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు  రీ రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసారు.

అందుతున్న సమాచారం మేరకు 31, డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఆఖరులో న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ సందర్బంగా ఈ చిత్రం రీరిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లోనూ భారిగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తో పాటు హరిహర వీరమల్లుకు చెందిన రెండు టీజర్లు, కొత్త టీజర్ విడుదల చేస్తారు. ఓవర్ సీస్ లో ఫరాస్ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. 

 నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ ” మొదట ఖుషీ సినిమాను రీ రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ, అప్పటికే తమ్ముడు, జల్సా రిలీజ్ అవ్వడంతో ఒకేసారి అన్ని సినిమాలు ఎందుకు అని మౌనంగా ఉండిపోయాను. త్వరలో  ఖుషీ ని మాస్టర్ వెర్షన్ లో అభిమానులకు అందిస్తాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏఎం నిర్మాతగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.  

ఇక ఈ నెల 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా సినిమా స్పెషల్ షోలతో చేసిన రచ్చ చేసారు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు దాదాపు 700 దాకా షోలు పడ్డాయి. రూ.3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఖుషీకు అంతకు మించి ఉంటుందని అంటున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్