సెన్సార్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమా.. ఏం తేల్చారంటే..?

Published : Sep 24, 2022, 11:37 PM ISTUpdated : Sep 24, 2022, 11:39 PM IST
సెన్సార్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున  ది ఘోస్ట్ సినిమా.. ఏం తేల్చారంటే..?

సారాంశం

సీనియర్ హీరో అయినా సరే కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు కింగ్ నాగార్జున. మన్మథుడు అన్న పేరు నిలబెట్టుకుంటున్నాడు. ఇక త్వరలో హై యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యి.. రిలీజ్ కు సై అంటోంది. 

టాలీవుడ్ మన్మథుడు  కింగ్ నాగార్జున  హీరోగా తెరకెక్కిన సినిమా ది ఘోస్ట్.  హైఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈసినిమా ను గుంటూర్ టాకీస్ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేశారు ఇక  ది ఘోస్ట్' సెన్సార్ పనులు  పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. 

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో  తెరకెక్కిన  ది ఘోస్ట్ ఈ సినిమా అక్టోబరు 5న దరసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది.  ఈ సినిమాలో కింగ్ నాగార్జున  సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈమూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్ కి  అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా  ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అదరిపోబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూస్తేనే హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ అలరించబోతున్నట్టు తెలుస్తోంది.  కాగా, ఈసారి దసరా సీజన్ కు సీనియర్ హీరోల చిత్రాలు సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం కూడా అక్టోబరు 5నే గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్