రామ్ చరణ్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అదే, రిటర్న్ గా నేను ఏమిచ్చానంటే... ఉపాసన కామెంట్స్ 

Published : Apr 13, 2023, 05:51 PM ISTUpdated : Apr 13, 2023, 05:55 PM IST
రామ్ చరణ్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అదే, రిటర్న్ గా నేను ఏమిచ్చానంటే... ఉపాసన కామెంట్స్ 

సారాంశం

రామ్ చరణ్ వైఫ్ ఉపాసన భర్త ఇచ్చిన మొదటి గిఫ్ట్ గుర్తు చేసుకున్నారు. తాము ప్రేమికులుగా ఉన్నప్పుడు జరిగిన సంగతులు పంచుకున్నారు.   

రామ్ చరణ్ దంపతులకు ఇది చాలా స్పెషల్ ఇయర్. వారి జీవితాల్లో వరుస పండుగలు చోటు చేసుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఏకంగా ఆస్కార్ గెలిచిన చిత్ర హీరోగా రికార్డులకు ఎక్కారు. ఆయన ఫేమ్ ఖండాంతరాలు దాటింది. ఉపాసన కూడా ఇటీవల బిజినెస్ ఉమన్ అరుదైన మైలురాళ్లు చేరుకున్నారు. కొత్త బాధ్యతలు చేపట్టారు. వీటన్నింటికీ మించి రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చిన నేపథ్యంలో కుటుంబంలో సంతోషాలు వెల్లువెత్తాయి. 

ప్రస్తుతం ఉపాసన-రామ్ చరణ్ విదేశీ టూర్లో ఉన్నారు. దుబాయ్, మాల్దీవ్స్ లో విహరిస్తున్నారు. చిన్న గ్యాప్ లో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. రామ్ చరణ్ తో తన ప్రేమ ప్రస్తావన రాగా ఆయన ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏమిటో ఉపాసన వెల్లడించారు. రామ్ చరణ్ నాకు మొదటి గిఫ్ట్ గా హార్ట్ సింబల్ ఉన్న  చెవి కమ్మలు ఇచ్చాడు. అవి అంటే నాకు చాలా ఇష్టం. తనకు రిటర్న్ గిఫ్ట్ గా అపరిమిత ప్రేమను ఇచ్చానని ఉపాసన అన్నారు. 

కడుపులో బిడ్డతో టూర్స్ తిరగడం ఆనందంగా ఉంది. మాతో పాటు బిడ్డ కూడా ప్రపంచాన్ని చుడుతున్నాడు. గర్భం దాల్చిన మహిళలు బాగా బరువు పెరుగుతారు. అయితే నేను కఠిన డైట్ ఫాలో అవుతున్నాను. బరువు పెరగకుండా చూసుకుంటున్నాను. అలా అని తినకుండా ఉండటం లేదు. నా కోసం బిడ్డ కోసం పోషకాహారం మాత్రమే తీసుకుంటున్నానని ఉపాసన అన్నారు. ఇంకా అనేక సంగతులు ఉపాసన చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే